Fake News, Telugu
 

పోస్టులోని వీడియోకీ, జామియా యూనివర్సిటీ విద్యార్థుల నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు

0

పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఫేస్బుక్ లో ఒక వీడియోని పోస్టు చేసి, అది జామియా మిలియా యూనివర్సిటీ నిరసనలకు సంబంధించిన వీడియో అని పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జామియా మిలియా యూనివర్సిటీ (ఢిల్లీ) విద్యార్థుల నిరసనలకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో 2017 లో గుజరాత్ లో జరిగిన ఘటనకి సంబంధించింది. సూరత్ లో BRTC బస్సు రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని గుద్దడంతో, అక్కడే ఉన్న కొంతమంది జనం ఆగ్రహంతో ఆ బస్సుని ధ్వంసం చేశారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక స్క్రీన్ షాట్ ఇమేజ్ యొక్క సెర్చ్ రిజల్ట్స్ లో పోస్టులో ఉన్న వీడియో యొక్క పూర్తి వీడియో లభించింది. ఆ వీడియో ని ఒక యూట్యూబ్ న్యూస్ ఛానెల్ జనవరి 28, 2017న అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో ద్వారా, గుజరాత్ లోని సూరత్ లో BRTC బస్సు రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని గుద్దడంతో, అక్కడే ఉన్న కొంతమంది జనం ఆగ్రహంతో ఆ బస్సుని ధ్వంసం చేసినట్లుగా తెలిసింది. కావున, ఆ వీడియోకీ ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, ఒక పాత అసంబంధమైన వీడియోని పెట్టి, ‘ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ నిరసనల వీడియో’ అని తప్పవుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll