Fake News, Telugu
 

మెర్సిడీస్ కారు తో పోలుస్తే ట్రాక్టర్ పై జీఎస్‌టీ రేటు రెండింతలు కాదు.

0

మెర్సిడీస్ కారు పై కంటే ట్రాక్టర్ పై జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) రేటు ఎక్కువ ఉందని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. మెర్సడీస్ కారు పై 6 శాతం జీఎస్‌టీ రేటు ఉంటే, ట్రాక్టర్ పై 12 శాతం జీఎస్‌టీ రేటు ఉందని పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మెర్సిడీస్ కారు తో పోలుస్తే ట్రాక్టర్ పై జీఎస్‌టీ రేటు రెండింతలు ఉంది.

ఫాక్ట్: మెర్సిడీస్ కారు పై 28 శాతం జీఎస్‌టీ ఉంది. మోటర్ వాహనాల బట్టి ‘Compensation Cess’ రేటు అధనంగా ఉంటుంది. కొన్ని ట్రాక్టర్ల (‘Road tractors for semi-trailers of engine capacity more than 1800 cc’) పై తప్ప మిగితా ట్రాక్టర్ల పై 12 శాతం జీఎస్‌టీ ఉంది. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు మెర్సడీస్ కారు తో పోలుస్తే ట్రాక్టర్ పై జీఎస్‌టీ రేటు రెండింతలు లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

మెర్సిడీస్ కారు పై జీఎస్‌టీ:

వాహనాల పై జీఎస్‌టీ రేటు ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వ జీఎస్‌టీ వెబ్సైటులో చూడగా, వాహనం పొడువు మరియు ఇంజిన్ కెపాసిటీ పై రెట్లు ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. మోటర్ కార్ల పై 28 శాతం జీఎస్‌టీ రేటు ఉన్నట్టు రేట్ల లిస్టులో చూడవొచ్చు. అంతేకాదు, వివిధ వాహనాల పై ‘Compensation Cess’ అధనంగా ఉంటుంది. మోటర్ వాహనాల బట్టి ‘Compensation Cess’ రేటు ఉంటుంది. ‘ఎస్‌యూవీ’ వాహనాల పై 22 శాతం ‘Compensation Cess’ ఉన్నట్టు చూడవొచ్చు.

తమ ప్రొడక్ట్స్ పై 28 శాతం జీఎస్‌టీ కి అదనంగా, 20-22 శాతం సెస్ పడుతుందని పీటీఐ తో ఇంటర్వ్యూలో మెర్సిడీస్-బెంజ్ ఇండియా ఎండీ మరియు సీఈఓ మార్టిన్ స్చ్వేంక్ తెలిపినట్టు ‘ది ఎకనామిక్ టైమ్స్’ ఆర్టికల్ లో చదవొచ్చు. కావున, పోస్ట్ లో చెప్పినట్టు మెర్సడీస్ కారు పై కేవలం ఆరు శాతం జీఎస్‌టీ లేదు.

ట్రాక్టర్ పై జీఎస్‌టీ:

పోస్ట్ లో చెప్పినట్టు ట్రాక్టర్ పై 12 శాతం జీఎస్‌టీ రేటు ఉన్నట్టు జీఎస్‌టీ వెబ్సైటులో చూడవొచ్చు. అయితే, Road tractors for semi-trailers of engine capacity more than 1800 cc’ వాటి పై మాత్రం 28 శాతం జీఎస్‌టీ రేటు ఉన్నట్టు తెలిసింది.

చివరగా, మెర్సిడీస్ కారు తో పోలుస్తే ట్రాక్టర్ పై జీఎస్‌టీ రేటు రెండింతలు లేదు.

Share.

About Author

Comments are closed.

scroll