కరోనా వాక్సిన్ ని తమ దేశానికి పంపించి సహాయం అందించినందుకు ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పెట్టిన హోర్డింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఫోటోలోని బిల్ బోర్డు పై “Thank You PM Modi for sending Covid-19 Vaccines. You are a good boy” అనే సందేశం రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కరోనా వాక్సిన్ ని తమ దేశానికి పంపించినందుకు ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పెట్టిన హార్డింగ్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న హార్డింగ్ పై నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఎటువంటి సందేశం రాయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఫోటోలో కనిపిస్తున్న ఈ బిల్ బోర్డు యొక్క సమాచారం దొరికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న బిల్ బోర్డుని ‘The Piccadilly Lights’ అని పిలుస్తారు. లండన్ లో ఉన్న ఈ బిల్ బోర్డుని ‘Ocean Outdoor’ అనే ప్రకటనల కంపెనీ నడిపిస్తున్నట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా ఆ బిల్ బోర్డుకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ బిల్ బోర్డు యొక్క ఒరిజినల్ ఫోటో ‘Ocean Outdoor’ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ లో దొరికింది. ఏప్రిల్ 2020 లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ లో, ఫోటోలోని బిల్ బోర్డు గురించి వివరిస్తూ ‘Expressions of support and inspiration from The Queen will be carried on the Piccadilly Circus screen from 10am on Wednesday, April 7 and run until Sunday, April 19. It is the first time the digital screen has carried a direct message from Her Majesty the Queen’ అని తెలిపారు. ఇంగ్లాండ్ మహారాణి ఏప్రిల్ 2020లో ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఈ బిల్ బోర్డు యొక్క ఒరిజినల్ ఫోటోలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తేలుపుతూ ఎటువంటి సందేశం రాసి లేదు. ఒరిజినల్ ఫోటోలోని బిల్ బోర్డు పై ‘We will be with our friends again; we will be with our families again; we will meet again’ అని రాసి ఉంది.
ఈ బిల్ బోర్డు యొక్క ఒరిజినల్ ఫోటోని ‘BBC London’ 08 ఏప్రిల్ 2020 నాడు తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది.
ఈ బిల్ బోర్డు ఫోటోని అనేక మిమ్స్ వెబ్ సైట్స్ వివిధ రకాలైన సందేశాలను ఎడిట్ చేసి షేర్ చేసినట్టు తెలిసింది. మీరు కూడా ఈ బిల్ బోర్డు పై మీకు నచ్చిన సందేశాన్ని ఇక్కడ రాసుకోవచ్చు.
భారత దేశం లో రూపొందించిన కరోనా వాక్సిన్లని భారత ప్రభుత్వం ఇటివల బ్రిటన్ కి పంపించిన మాట వాస్తవం. Dr. S. జై శంకర్, the External Affairs Minister of India ఈ విషయాన్నీ తెలుపుతూ ‘India-UK partnership in action. Made in India vaccines delivered in London today’ అని 05 మర్చి 2021 నాడు ట్వీట్ చేసారు. భారత దేశం UK కి వాక్సిన్లను సరఫరా చేసిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ ఇంగ్లాంగ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పెట్టిన హార్డింగ్ అంటున్నారు.