Fake News, Telugu
 

సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించలేరు

0

సైటోస్పాంజ్ అనబడే ఈ కొత్త టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించొచ్చని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించవచ్చు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించొచ్చని ఎక్కడా అనలేదు. సైటోస్పాంజ్ పరీక్ష వల్ల అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సైటోస్పాంజ్ అనేది జెలటిన్ క్యాప్సూల్ (పిల్) లోపల ఉండే ఒక చిన్న మెష్ స్పాంజ్. ‘పిల్’ ఒకసారి మింగిన తరువాత పొట్టలో కరిగిపోయి, సైటోస్పాంజ్‌ను విడుదల చేస్తుంది, ఇది రోగి యొక్క ఆహార నాళం (food pipe) ద్వారా తిరిగి పైకి లాగుతారు. తద్వారా, దాదాపు అర మిలియన్ కణాలను (cells) సేకరించి అన్నవాహిక (oesophageal) క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించడానికి టెస్టుకి తీసుకెల్తారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

పోస్టులోని వీడియోను జాగ్రత్తగా గమనించినట్లైతే, అందులో ఎక్కడా కూడా సైటోస్పాంజ్ టెక్నిక్‌ వల్ల గుండెలోని బ్లాకేజీలను డైరెక్టుగా తొలగించొచ్చని లేదు. “స్ట్రింగ్ మీద ఉండే ఈ చిన్న ‘పిల్’ క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ ‘పిల్’ ఒకసారి మింగిన తరువాత పొట్టలో కరిగిపోయి, సైటోస్పాంజ్‌ను విడుదల చేస్తుంది, ఇది రోగి యొక్క ఆహార నాళం (food pipe) ద్వారా తిరిగి పైకి లాగుతారు. తద్వారా, దాదాపు అర మిలియన్ కణాలను (cells) సేకరించి అన్నవాహిక (oesophageal) క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించడానికి టెస్టుకి తీసుకెళ్తారు.”

సైటోస్పాంజ్ పరీక్ష వల్ల అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని డాక్టర్ రిచర్డ్ డెవీస్ వీడియోలో తెలిపారు. ఎక్కడా కూడా హార్ట్ ఎటాక్ గురించి ప్రస్తావించలేదు. “సైటోస్పాంజ్ పరీక్ష ఎండోస్కోపీ కంటే చౌకగా మరియు మత్తు (sedation) అవసరం లేకుండా చేయొచ్చు. అన్నవాహిక క్యాన్సర్ యొక్క 5 సంవత్సరాల మనుగడ రేటు కేవలం 18%, అది కూడా ఆలస్యంగా నిర్ధారించడం వల్ల జరుగుతుంది.”

సైటోస్పాంజ్ అనేది జెలటిన్ క్యాప్సూల్ (పిల్) లోపల ఉండే ఒక చిన్న మెష్ స్పాంజ్. అన్నవాహిక కణాలను సేకరించడం కొరకు ప్రైమరీ కేర్ సెట్టింగ్ ల్లో నోటి ద్వారా ఇవ్వబడుతుంది. సైటోస్పాంజ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేయబడింది. యుకెలో క్యాన్సర్ మరణాలకు ఏడవ అత్యంత సాధారణ కారణం అన్నవాహిక క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించినట్టైతే, దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవొచ్చు.

చివరగా, సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించొచ్చని ఈ వీడియోలో చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll