Fake News, Telugu
 

ఢిల్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలకి పోటీ చేసిన ‘ఆరు’ స్థానాల్లో కలిపి ‘3192’ ఓట్లు వచ్చాయి

0

2020 ఢిల్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు 60 సీట్లలో పోటీ చేస్తే, కేవలం 172 ఓట్లు మాత్రమే వచ్చాయని ఉన్న పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2020 ఢిల్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు 60 సీట్లలో పోటీ చేస్తే, కేవలం 172 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఫాక్ట్ (నిజం): ఢిల్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు (సీపీఐ మరియు సీపిఐ (ఎం)) ‘ఆరు’ స్థానాల్లో మాత్రమే పోటీ చేసాయి. వారికి మొత్తంగా ‘3192’ ఓట్లు వచ్చాయి. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఢిల్లీ అసెంబ్లీ లో మొత్తం ‘70’ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని చోట్లలో పోటీ చేసింది మరియు ఎన్ని ఓట్లును పొందింది అనే సమాచారం భారత ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ లో దొరికుతుంది. ఆ వెబ్ సైట్ లోని వివరాలను చూడగా, కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఐ మరియు సీపిఐ (ఎం) రెండూ కలిపి ‘ఆరు’ నియోజకవర్గాల్లో పోటీ చేశాయని తెలిసింది. ‘సీపీఐ’ పోటీ చేసిన మూడు నియోజకవర్గాలలో (భవానా, తిమార్పూర్, మరియు పాలం) కలిపి పోల్ అయిన ఓట్లు 1956 . సీపిఐ (ఎం) పోటీ చేసిన మూడు నియోజకవర్గాలలో (వజీర్పూర్, బాదార్పుర్, మరియు కరవాల్ నగర్) కలిపి పోల్ అయిన ఓట్లు 1236. కావున ఈ ఆరు నియోజికవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు మొత్తం పోల్ అయిన మొత్తం ఓట్లు ‘3192’.

చివరగా, ఢిల్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ‘ఆరు’ స్థానాల్లో పోటీ చేసాయి. మొత్తంగా వాళ్లకు ‘3192’ ఓట్లు వచ్చాయి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll