Fake News, Telugu
 

ఈ వీడియో 2019లో చైనాలో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌కు సంబంధించినది; ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలకు నృత్య ప్రదర్శన చేయలేదు

0

“చాలా మంది వ్యక్తులు హిందూ శ్లోకాలు, కీర్తనలు మరియు భగద్గీత శ్లోకాలకు అద్భుతమైన నృత్యం చేశారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చాలా మంది వ్యక్తులు హిందూ శ్లోకాలు, కీర్తనలు మరియు భగవద్గీత శ్లోకాలకు అద్భుతమైన నృత్యం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2019లో చైనాలో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా 2019 (చైనీస్ న్యూ ఇయర్) కార్యక్రమానికు సంబంధించినది. ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలుపై గానీ, భగవద్గీత శ్లోకాలుపై గానీ నృత్య ప్రదర్శన జరగలేదు. ఈ కార్యక్రమంలో వేరొక సంగీతానికి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను 04 ఫిబ్రవరి 2019న, చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక మీడియా సంస్థ అయిన “సిజిటిఎన్(CGTN)” యొక్క అధికారక యుట్యూబ్ ఛానల్ షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో “స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా 2019 (Chinese New Year)” ఈవెంట్‌కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. అలాగే, ఈ వీడియో ‘హెనాన్ షావోలిన్ టాగౌ మార్షల్ ఆర్ట్స్ స్కూల్’ చెందిన విద్యార్థులు చేసిన “ది సోల్ ఆఫ్ షావోలిన్” అనే సాంప్రదాయ చైనీస్ యుద్ధ కళలను చూపిస్తున్నది అని పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియో ఫిబ్రవరి 2019లో చైనాలో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా 2019 (చైనీస్ న్యూ ఇయర్, 2019) ఈవెంట్‌కు సంబంధించినదని పేర్కొంటూ పలు రిపోర్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కడా మనకు హిందూ శ్లోకాలుగానీ, భగవద్గీత శ్లోకాలుగానీ వినిపించవు. ఈ వీడియోలలో మనం విభిన్న సంగీతానికి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనను చూడవచ్చు. దీన్ని బట్టి ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలుపై గానీ, భగవద్గీత శ్లోకాలుపై గానీ నృత్య  ప్రదర్శన జరగలేదని మనం నిర్ధారించవచ్చు.

 చివరగా, ఈ వీడియో 2019లో చైనాలో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా (చైనీస్ న్యూ ఇయర్) కార్యక్రమానికి సంబంధించినది; ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలపై నృత్య ప్రదర్శన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll