Citizenship Amendment Bill (CAB) ని వ్యతిరేకిస్తూ బెంగాల్ లో రోహింగ్యాలు ఒక పాసెంజర్ ట్రైన్ మీద రాళ్లతో దాడి చేసారని, ఆ దాడిలో గాయపడిన చిన్నారి ఫోటో అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.

క్లెయిమ్: బెంగాల్ లో Citizenship Amendment Bill (CAB) కి వ్యతిరేకంగా రోహింగ్యాలు ఒక పాసెంజర్ ట్రైన్ మీద రాళ్లతో జరిపిన దాడిలో గాయపడ్డ చిన్నారి ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో CAB బిల్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకి సంబంధించింది కాదు. అది బంగ్లాదేశ్ లో జరిగిన ఒక రైలు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి ఫోటో. కావున, పోస్ట్ లో చేసిన క్లెయిమ్ అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోను ‘yandex’ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతకగా, అదే ఫోటో ‘United News of Bangladesh’ వారు నవంబర్ 12, 2019న ప్రచురించిన ఒక ఆర్టికల్ లో కనిపించింది. ఆ ఆర్టికల్ బంగ్లాదేశ్ లోని బ్రాహ్మన్ బరియా అనే ఒక జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించింది. ఇంకో ఆర్టికల్ ప్రకారం, ఆ ఫోటో లో వున్న చిన్నారి పేరు నైమా అని, తను రైలు ప్రమాదం వలన గాయపడింది అని తెలిసింది.

చివరగా, బంగ్లాదేశ్ రైలు ప్రమాదంలో గాయపడ్డ ఒక చిన్నారి ఫోటోను తీసుకొని CAB బిల్ కి వ్యతిరేకంగా రోహింగ్యాలు జరిపిన నిరసనల్లో గాయపడినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఆ చిన్నారి గాయపడింది బంగ్లాదేశ్ రైలు ప్రమాదంలో, CAB బిల్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో కాదు - Fact Che