Fake News, Telugu
 

“ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు” అని చంద్రబాబు నాయుడు అనలేదు

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల మోదీ ప్రభుత్వం అమలు చేస్తామన్న పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act/CAA) గురించి మాట్లాడుతూ “పాస్పోర్ట్ లేకుండా భారతీయులం ముస్లిం దేశాలలో ఉండగలమా, ఎవ్వరికీ రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు, 2014-19 వరకు ఎలా అయితే భాజాపా మరియు తెదేపా కలిసి అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది, నిధులు వస్తాయి” అని మాట్లాడారని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇదే వీడియోను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు “ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు” అని మాట్లాడారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 15 మార్చి 2024న చంద్రబాబు మీడియాతో 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని PPTలో ఆధారాలను చూపిస్తూ వివరించిన వీడియో. మీడియా అడిగిన ప్రశలకు సమాధానం ఇస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం గురించి కూడా మాట్లాడారు. తెలుగు ప్రజలు అమెరికాకు వెళ్తే పౌరసత్వం లేదా? మనం ఇతర దేశాలకు పాస్పోర్ట్ లేకుండా వెళ్తున్నామా? ముస్లిం దేశాలకు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ పట్ల అభద్రతా భావం దొంగతనం చేసే వాళ్ళకి ఉంటుంది అని, అన్నిటినీ రాజకీయం చెయ్యరాదు అని తెలిపారు. ముస్లింలలో పేదరికం ఉన్నందున ఇప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉంది అని, హిందూ దేశాలైనా, ముస్లిం దేశాలైనా, క్రిస్టియన్ దేశాలైనా పౌరసత్వం అనేది పారదర్శకతను, భద్రతను కలిపించటానికి మాత్రమే అని తెలిపారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే ఇది 15 మార్చి 2024న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని రుజువు చేయటానికి ఆధారాలను మీడియాకు వివరించిన వీడియో అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

అసలు వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబు మీడియాతో 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని PPTలో ఆధారాలను చూపిస్తూ వివరించారు. మీడియా అడిగిన ప్రశలకు సమాధానం ఇస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం గురించి కూడా మాట్లాడారు. తెలుగు ప్రజలు అమెరికాకు వెళ్తే పౌరసత్వం లేదా? మనం ఇతర దేశాలకు పాస్పోర్ట్ లేకుండా వెళ్తున్నామా? ముస్లిం దేశాలకు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ పట్ల అభద్రతా భావం దొంగతనం చేసే వాళ్ళకి ఉంటుంది అని, అన్నిటినీ రాజకీయం చెయ్యరాదు అని తెలిపారు. ముస్లింలలో పేదరికం ఉన్నందున ఇప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉంది అని, హిందూ దేశాలైనా, ముస్లిం దేశాలైనా, క్రిస్టియన్ దేశాలైనా పౌరసత్వం అనేది పారదర్శకతను మరియు భద్రతను కలిపిస్తుంది అని తెలిపారు.

అసలు వీడియోను చంద్రబాబుకు వ్యతిరేక భావం వచ్చేలాగా వివిధ చోట్ల ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ గురించి పలు వార్తా పత్రికలు ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, “ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు” అని చంద్రబాబు నాయుడు అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll