Fake News, Telugu
 

కోవిడ్-19 వాక్సినేషన్ అభిప్రాయ సేకరణ పేరుతో 912250041117 నంబరు నుంచి వస్తున్న కాల్స్ మోసపురితవైనవి

0

కోవిడ్-19 వాక్సినేషన్ అభిప్రాయ సేకరణ (ఫీడ్‌బాక్) పేరుతో ప్రజల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ‘ఇపుడే కొంత మందికి 912250041117 నుండి ఫోన్ కాల్ వచ్చింది, మీరు టీకాలు వేయించుకున్నట్లయితే 1 నొక్కమని కోరాడు. అతను 1 నొక్కాడు. వెంటనే ఆ సంఖ్య ఎర్రగా మారింది మరియు అతని ఫోన్ హ్యాక్ చేయబడింది’, అంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, ఈ విధానం ద్వారా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని కూడా గల్లంతు చేస్తున్నారని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కోవిడ్-19 వాక్సినేషన్ ఫీడ్‌బాక్ పేరుతో 912250041117 నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ప్రజల ఫోన్లని హ్యాక్ చేస్తున్నాయి.

ఫాక్ట్ (నిజం): కోవిడ్-19 వాక్సినేషన్ అభిప్రాయ సేకరణ పేరుతో 912250041117 నంబరు నుంచి వస్తున్న కాల్స్ మోసపురితవైనవని PIB ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాని, ఈ ఫోన్ కాల్స్ ద్వార ఫోన్లని హ్యాక్ లేదా బ్యాంకు అకౌంట్లోని డబ్బులు గల్లంతు చేస్తున్నారని PIB లేదా మరే ఒక న్యూస్ సంస్థ ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. భారత ప్రభుత్వం కోవిడ్-19 వాక్సినేషన్ ఫీడ్‌బాక్ కోసం ఉపయోగిస్తున్న నంబరు ‘1921’ అని PIB తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఈ మెసేజ్ వివరాల కోసం వెతికితే, ఈ మెసేజ్ కనీసం 2021 ఏప్రిల్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఇదే మెసెజ్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులని ఇక్కడ, క్క మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసెజ్‌పై స్పష్టతనిస్తూ PIB ఫాక్ట్-చెక్ 22 మే 2021 నాడు ట్వీట్ పెట్టింది. కోవిడ్-19 వాక్సినేషన్ ఫీడ్‌బాక్ పేరుతో 912250041117 నంబరు నుంచి వచ్చే కాల్స్ మోసపురితవని PIB ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాని, ఈ ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్లని హ్యాక్ లేదా బ్యాంకు అకౌంట్లోని డబ్బులు గల్లంతు చేస్తున్నారని PIB లేదా మరే ఒక న్యూస్ సంస్థ రిపోర్ట్ చేయలేదు. అంతేకాదు, భారత ప్రభుత్వం కోవిడ్-19 వాక్సినేషన్ ఫీడ్‌బాక్ కోసం ఉపయోగిస్తున్న నంబరు ‘1921’ అని PIB తెలిపింది. భారత ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రుత్వ శాఖ (MEITY) రూపొందించిన రాపిడ్ అస్సేస్మేంట్ సిస్టం (RAS) ప్లాట్ఫారం ద్వారా వాక్సినేషన్ ఫీడ్‌బాక్ తీసుకొబోతున్నట్టు PIB 22 జనవరి 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.

PIB ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్ పై ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసెజ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ACP కేవిఎం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, “మేము ఈ నంబరు (912250041117)ని చెక్ చేసి చూస్తే, ఈ ఫోన్ నంబరు ప్రస్తుతం ఉనికిలో లేదని తెలిసింది. కాబట్టి, ఈ మెసేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆ నంబర్ నుండి ఏ వ్యక్తికి కాల్ రాలేదు”, అని తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘Telangana Today’ న్యూస్ సంస్థ 26 ఏప్రిల్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, కోవిడ్-19 వాక్సినేషన్ అభిప్రాయ సేకరణ పేరుతో 912250041117 నంబరు నుంచి వచ్చే కాల్స్ మోసపురితవైనవి.

Share.

About Author

Comments are closed.

scroll