Fake News, Telugu
 

ఈస్ట్ లడఖ్ శ్యోక్ నది పై నిర్మించిన వంతెనని గల్వాన్ నది పై 600 మీటర్ల పొడువైన వంతెన నిర్మించినట్టు షేర్ చేస్తున్నారు

0

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గల్వాన్ నదిపై 600 మీటర్ల వంతెన నిర్మించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. గత సంవత్సరం చైనా ఆర్మీ తో ఘర్షణ జరిగిన గల్వాన్ వ్యాలీలో భారత సైనికుల రక్షణ కోసం ఈ వంతెన నిర్మించినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గల్వాన్ నది పై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 600 మీటర్ల పోడువైన వంతెన యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్నది ఈస్ట్ లడక్ లోని శ్యోక్ నది పై నిర్మించిన కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెన, గల్వాన్ నది పై నిర్మించిన వంతెన కాదు. దర్బుక్, దౌలత్ ప్రదేశాలని కలుపుతూ నిర్మించిన 255 కిలోమీటర్ల రహదారి పై 430 మీటర్ల పొడువైన ఈ చెవాంగ్ రిచేన్ సేతు వంతెనని నిర్మించారు. గల్వాన్ నది పై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన వంతెన 60 మీటర్ల పోడువు కలిగి ఉంటుంది, పోస్టులో చెబుతున్నట్టు 600 మీటర్ల పొడువు ఉండదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Swarajya’ న్యూస్ వెబ్సైటు 06 జూలై 2020 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో షేర్ చేసినట్టు తెలిసింది. ఫోటోలో కనిపిస్తున్నది ఈస్ట్ లడక్ లోని శ్యోక్ నది పై నిర్మించిన కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెన అని ఆర్టికల్ లో తెలిపారు. భారత దేశపు అత్యంత ఎత్తైన శాశ్వత వంతెన అయిన ఈ చెవాంగ్ రిచేన్ బ్రిడ్జి ని 2019లో ప్రారంభించారు.  ఈ వంతెనకు సంబంధించిన వివరాలని తెలుపుతూ ‘The Times of India’ న్యూస్ వెబ్సైటు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

దర్బుక్ మరియు దౌలత్ ప్రదేశాలని కలుపుతూ నిర్మించిన 255 కిలోమీటర్ల రహదారి పై 430 మీటర్ల పొడువైన ఈ కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెనని నిర్మించారు. కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెన గురించి రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు పబ్లిష్ చేసిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో కనిపిస్తున్న అదే వంతెన దృశ్యాన్ని ఈ వీడియోలలో చూడవచ్చు. చెవాంగ్ రిచేన్ సేతు బ్రిడ్జి గల్వాన్ వ్యాలికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2020లో `చైనా ఆర్మీ తో ఘర్షణకు మూలకారణమైన గల్వాన్ వ్యాలి బ్రిడ్జి ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జూన్ 2020 లో పూర్తి చేసింది. చైనా ‘లైన్ ఆఫ్ అక్చ్యువల్ కంట్రోల్’ సమీపంలో గల్వాన్ నది పై నిర్మించిన ఈ వంతెన 60 మీటర్ల పొడువు కలిగి ఉంటుంది. పోస్టులో చెబుతున్నట్టుగా 600 మీటర్ల పొడువు ఉండదు. గాల్వాన్ నది పై భారత్ నిర్మించిన ఈ వంతెన యొక్క సాటిలైట్ దృశ్యాలని షేర్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది  శ్యాక్ నది పై నిర్మించిన కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెన అని, గల్వాన్ నది పై కట్టిన వంతెన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈస్ట్ లడఖ్ లోని శ్యోక్ నది పై నిర్మించిన కల్నల్ చెవాంగ్ రిచేన్ సేతు వంతెనని గాల్వాన్ నది పై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 600 మీటర్ల పొడువైన వంతెనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll