Coronavirus Telugu, Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం PM CARES వివరాలు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ MP సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేయలేదు

0

‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎప్పుడో PM CARES కి విరాళాలు సేకరించారు, వాటిని ఎప్పుడు, ఎక్కడ వాడినట్లు ఎలాంటి రుజువులు లేవు, ఇప్పటికైనా వాటి వివరాలను ప్రజలకు తెలియజేయాలి’, అని BJP MP సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పబ్లిసిటీ తగ్గించుకొని ప్రజల గురించి ఆలోచించాలి అని ఆయన పేర్కొన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: PM CARES వివరాలు ప్రజలకి తెలియజేయాలని బీజేపీ MP సుబ్రమణియన్ స్వామి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం PM CARES వివరాలని ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ MP సుబ్రమణియన్ స్వామి ఇటివల ఎటువంటి ట్వీట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం PM CARES నిధులని వలస కూలీల ప్రయోజనాలకి ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నిస్తూ సుబ్రమణియన్ స్వామి మే 2020లో ఒక  ట్వీట్ పెట్టారు. కానీ, PM CARES గురుంచి పోస్టులో చెప్పిన వివరాలు ప్రజలకి తెలియజేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, కేంద్ర ప్రభుత్వం PM CARES వివరాలు తెలియచేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ MP సుబ్రమణియన్ స్వామి ఇటీవల ఎటువంటి ట్వీట్ పెట్టలేదని తెలిసింది. ఒక వేళ PM CARES వివరాలు ప్రజలకి తెలిజేయాలని సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రముఖ న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అవలేదు.

మే 2020లో కేంద్ర ప్రభుత్వం PM CARES నిధులని వలస కూలీల ప్రయోజనాలకి ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నిస్తూ సుబ్రమణియన్ స్వామి ఒక ట్వీట్ చేసారు. PM CARES ఆడిట్ పై సుబ్రమణియన్ స్వామి పెట్టిన మరొక ట్వీట్ ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, PM CARES నిధులని ప్రభుత్వ అధికారులు కొందరు దారి మల్లిస్తున్నట్టు సుబ్రమణియన్ స్వామి మరొక ట్వీట్ లో ఆరోపించారు. కాని, పోస్టులో తెలిపినట్టుగా PM CARES వివరాలని బయటపెట్టాలని సుబ్రమణ్యం స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు.

చివరగా,కేంద్ర ప్రభుత్వం PM CARES వివరాలు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ MP సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll