Fake News, Telugu
 

“నాకూ ఆ నన్ కు మధ్య జరిగింది ‘రేప్ ‘ కాదు.. పవిత్రకార్య సాధన” అంటూ బిషప్ ఫ్రాంకో ములక్కల్ వ్యాఖ్యలు చేయలేదు

1

కేరళలో ఒక నన్ ని మానభంగం చేసాడనే ఆరోపణలు ఎదురుకుంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది- ‘నాకూ ఆ నన్ కు మధ్య జరిగింది ‘రేప్ ‘ కాదు..  పవిత్రకార్య సాధన కోసం చేసిన కవ్వం చిలుకులో చివర్న కవ్వం వణుకులో మహాజ్ణాన పెరుగుకవ్వపు చిలకరింతలో చిందిన పవిత్రాత్మ యేసు వారి మజ్జిగ చుక్కల కార్యం.. కనుక..చర్చిల్లో జరిగేది మానభంగాలు కాదు..వెన్నకోసం చిలికే కవ్వపు సయ్యాట మాత్రమే’. ఆ వ్యాఖ్యలు బిషప్ ములక్కల్ నిజంగానే చేశాడా చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: “నాకూ ఆ నన్ కు మధ్య జరిగింది ‘రేప్ ‘ కాదు.. పవిత్రకార్య సాధన కోసం చేసిన కవ్వం…” అంటూ బిషప్ ఫ్రాంకో ములక్కల్ వ్యాఖ్యలు చేసాడు.

ఫాక్ట్ (నిజం): బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన అలా అన్నట్లుగా పేర్కొన్నది ఒక ‘సెటైరికల్’ వెబ్సైట్ యొక్క ట్విట్టర్ అకౌంట్. అంతేకాదు, అలాంటి వ్యాఖ్యలతో ఉన్న న్యూస్ ఛానల్ టెంప్లేట్ ఒక వెబ్సైటు ద్వారా సృష్టించబడింది. కావున, ఆరోపణ తప్పు.

కేరళలో బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఒక నన్ ని మానభంగం చేసాడనే ఆరోపణలు ఎదురుకుంటున్నట్లుగా ‘India Today’ కథనం ద్వారా తెలుస్తుంది. పోస్టులో ఆరోపించినట్లుగా ఆ  వ్యాఖ్యలు (‘Whatever happened between me and nun, it is not rape. It is the Holi Ritual of enlightenment to feel the Magical Existence of Holi Jesus at the end of the act’) బిషప్ ములక్కల్ చేశాడా అని గూగుల్ లో వెతికినప్పుడు, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఏ వార్తా సంస్థ న్యూస్ రిపోర్ట్ కూడా లభించలేదు. అదే విషయంతో ఫేస్బుక్ లో మరియు ట్విట్టర్ లో వెతికినప్పుడు, గత సంవత్సరం నుండి అలాంటి ప్రచారం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వెతికే  ప్రక్రియలో బిషప్ ములక్కల్ ఆ వ్యాఖ్యలు చేసాడని ఆరోపిస్తూ మొట్టమొదట ‘The Unpaid News’ అనే పేరుతొ ఉన్న ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ అకౌంట్ యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు, అది ‘సెటైరికల్’ వెబ్సైటుకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అని తెలిసింది. తాము అందరి కంటే బెస్ట్ ఫేక్ న్యూస్ రాస్తాము అని కూడా వాళ్ళ ట్విట్టర్ ప్రొఫైల్ లో ఉంటుంది.

ట్వీట్ లో పెట్టిన స్క్రీన్ షాట్ లో ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక న్యూస్ ఛానల్ టెంప్లేట్ ఉంది. అందులో, ‘ANI’ వాటర్ మార్క్ దగ్గర ‘breakyourownnews.com’ అని ఉండడం గమనించవచ్చు మరియు ‘Holy’ కి బదులుగా ‘Holi’ అని ఉండడం కూడా చూడవచ్చు. ‘Break Your Own News’ వెబ్సైటు ద్వారా మనకు కావాల్సిన హెడ్ లైన్స్ ని మరియు ఫోటోని పెట్టి అలాంటి టెంప్లేట్ లను రూపొందించొచ్చు. 

చివరగా, బిషప్ ఫ్రాంకో ములక్కల్ ‘ఆ నన్ కు నాకూ మధ్య జరిగింది రేప్ కాదు’ అని అనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll