Fake News, Telugu
 

అసదుద్దీన్ ఓవైసీ 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో తన ఆస్తులు 17 కోట్ల రూపాయలని పేర్కొన్నాడు, 400 కోట్ల రూపాయలని కాదు

0

‘అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు నాడు 40 లక్షలు రూపాయలు మరియు నేడు 400 కోట్ల రూపాయలు’ అనే థంబ్ నేల్ తో ఉన్న యూట్యూబ్ వీడియో ని చాలా మంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ వీడియో లో ఒక వ్యక్తి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అసదుద్దీన్ ఓవైసీ తన ఆస్తులు 2004 అఫిడవిట్ లో 40-50 లక్షల రూపాయలని పేర్కొన్నాడని మరియు  2019 అఫిడవిట్ లో 400 కోట్ల రూపాయలని పేర్కొన్నాడని చెప్తాడు. ఆ విషయంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అసదుద్దీన్ ఓవైసీ తన ఆస్తులు 2004 అఫిడవిట్ లో 40 లక్షల రూపాయలని మరియు 2019 అఫిడవిట్ లో 400 కోట్ల రూపాయలని పేర్కొన్నాడు.

ఫాక్ట్ (నిజం): అసదుద్దీన్ ఓవైసీ తన ఆస్తులు 2004 అఫిడవిట్ లో 39 లక్షల రూపాయలని పేర్కొన్నాడు మరియు 2019 అఫిడవిట్ లో 17 కోట్ల రూపాయలని పేర్కొన్నాడు. కావున, వీడియో లో చెప్పినట్లుగా అసదుద్దీన్ ఓవైసీ తన ఆస్తులు 2019 అఫిడవిట్ లో 400 కోట్ల రూపాయలని పేర్కొనలేదు. పోస్టులో చెప్పింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

అసదుద్దీన్ ఓవైసీ 2004 లో ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ లో తన ఆస్తులు 39 లక్షల రూపాయలు (చరాస్తుల విలువ 9 లక్షల రూపాయలు మరియు స్థిరాస్తుల విలువ 30 లక్షల రూపాయలు) అని పేర్కొన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. అంటే, వీడియో లో చెప్పిన అసెట్స్ విలువ (40-50 లక్షల రూపాయలు) కి అది దగ్గరగానే ఉంది.

అసదుద్దీన్ ఓవైసీ 2019 లో ఎన్నికల కమిషన్ కి అందించిన అఫిడవిట్ లో తన ఆస్తులు సుమారుగా 17 కోట్ల రూపాయలు (చరాస్తుల విలువ విలువ 1.8 కోట్ల రూపాయలు  మరియు స్థిరాస్తుల విలువ విలువ 16 కోట్ల రూపాయలు) అని పేర్కొన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. కానీ, వీడియో లో అసెట్స్ విలువ 400 కోట్ల రూపాయలని చెప్పారు, అది తప్పు. అంతేకాదు, అప్పులు సుమారు 12 కోట్లు ఉన్నట్టుగా చూడవొచ్చు.

అలాగే, అసదుద్దీన్ ఓవైసీ తన ఆస్తి విలువ 2009 అఫిడవిట్ లో 93 లక్షలని మరియు 2014 అఫిడవిట్ లో 4 కోట్ల రూపాయలని పేర్కొన్నాడు.

చివరగా, అసదుద్దీన్ ఓవైసీ 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో తన ఆస్తులు 17 కోట్ల రూపాయలని పేర్కొన్నాడు, 400 కోట్ల రూపాయలని కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll