Fake News, Telugu
 

‘ఆర్ట్ వర్క్’ వీడియోని కర్ణాటక మాజీ మంత్రి డి.కే.శివకుమార్ ఇంట్లో జరిగిన సోదా వీడియో అని ప్రచారం చేస్తున్నారు

1

కరెన్సీ నోట్లు కాలిపోయి ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘కర్ణాటక మాజీ మంత్రి D.K.Sivakumar ఇంట్లో సోదా. డబ్బులు తగలపెట్టటానికి ఇంట్లో వాళ్ల ప్రయత్నం’ అనే ఆరోపణతో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఆరోపణ ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కర్ణాటక మాజీ మంత్రి డి.కే.శివకుమార్ ఇంట్లో వారు డబ్బులు తగల పెట్టడానికి ప్రయత్నిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో లో కనిపించేది స్పెయిన్ లోని మాడ్రిడ్ కి చెందిన కళాకారుడు ‘అలెజాండ్రో మోంగే’ చేసిన ఆర్ట్ వర్క్ కి సంబంధించింది. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు. 

పోస్టు లో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినప్పుడు, దాని యొక్క కీఫ్రేమ్స్ వచ్చాయి. ఆ కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ద్వారా అదే వీడియో యూట్యూబ్ లో ‘ఒక యురోపియన్ బ్యాంకు లో కాలిపోతున్న యూరోస్’ అనే ఆరోపణతో ఉన్నట్లుగా తెలిసింది. ఆ వీడియో యొక్క కామెంట్స్ చదివినప్పుడు, ఒక వినియోగదారుడు అందులో కనిపించేది ‘అలెజాండ్రో మోంగే’ అనే కళాకారుడు చేసిన ఆర్ట్ వర్క్ అని పేర్కొన్నాడు. ఆ సమాచారం ఆధారంగా వెతికినప్పుడు, అలెజాండ్రో మోంగే యొక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆ ఆర్ట్ వర్క్ యొక్క ఫోటో లభించింది.

అలెజాండ్రో మోంగే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, ఆ ఆర్ట్ వర్క్ ఆధారంగా వివిధ దేశాలలో (పాకిస్తాన్, రష్యా, జపాన్) వచ్చిన ఇతర ఫేక్ ఆరోపణలను గురించి కూడా పోస్ట్ చేశాడు. భారత దేశంలో కూడా అదే వీడియో అనేక ఇతర అరోపణలతో చాలా రోజులుగా చలామణి అవుతోంది.

చివరగా, పోస్టులో పెట్టిన వీడియో కర్ణాటక మాజీ మంత్రి డి.కే.శివకుమార్ ఇంట్లో వారు డబ్బులు తగల పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటిది కాదు. అది ఒక ‘ఆర్ట్ వర్క్’ కి సంబంధించిన వీడియో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll