Fake News, Telugu
 

అఫీలియన్ సమయంలో భూమికి, సూర్యునికి మధ్య దూరం 66% పెరగదు; వాతావరణంలో గణనీయమైన మార్పులకు ఇది ప్రధాన కారణం కాదు

0

రేపటినుండి ప్రారంభమై 22 ఆగస్ట్ 2022న ముగియనున్న ‘అఫీలియన్ దృగ్విషయం’ భూమికి మునుపెన్నడూ లేని విధంగా చల్లటి వాతావరణాన్ని కలిగిస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 90,000,000 కి.మీ అని కూడా పోస్ట్ పేర్కొంది, అయితే ‘అఫీలియన్ దృగ్విషయం’ సమయంలో ఈ దూరం 66% పెరిగి 152,000,000 కి.మీ అవుతుందని తెలిపారు. ఈ ఆర్టికల్ ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘అఫీలియన్ దృగ్విషయం’ వాతావరణాన్ని చల్లగా మారుస్తుంది; సూర్యుడు మరియు భూమి మధ్య దూరాన్ని 66% పెంచుతుంది.

ఫాక్ట్ (నిజం): భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు అఫీలియన్; భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు పెర్‌హీలియన్ అంటారు. భూమి యొక్క అఫీలియన్ సూర్యుని నుండి సుమారు 94.5 మిలియన్ మైళ్ళు (152 మిలియన్ కిలోమీటర్ల) దూరంలో ఉంది. పెర్‌హీలియన్ సూర్యుని నుండి సుమారు 91.4 మిలియన్ మైళ్లు (147 మిలియన్ కిలోమీటర్ల) దూరంలో ఉంది. సగటున, భూమి నుండి సూర్యుడికి దూరం దాదాపు 93 మిలియన్ మైళ్లు (150 మిలియన్ కిలోమీటర్లు). భూమి మరియు సూర్యుని మధ్య సగటు దూరాన్ని పరిగణించినప్పుడు, అఫీలియన్ యొక్క పెరుగుదల కేవలం 1.4% మాత్రమే. కాబట్టి, ‘అఫీలియన్ దృగ్విషయం’ కారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 66% పెరగడం అనేది తప్పు. అఫీలియన్ మరియు పెర్‌హీలియన్ ప్రతి ఏటా జరిగే సంఘటనలు (annual events). 2022లో, అఫీలియన్, 04 జూలై 2022న జరిగింది. కాబట్టి, అఫీలియన్ అనేది 04 జూలై 2022 నుండి 22 ఆగస్టు 2022 వరకు జరిగే ఒక దృగ్విషయం అని క్లెయిమ్ చేయడం సరైనది కాదు. అఫీలియన్ సూర్యుడి నుండి బాగా దూరంగా ఉన్నపటికీ వాతావరణం యొక్క వ్యవధిని ప్రభావితం చేస్తుంది కానీ తీవ్రతను అంతగా కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

అఫీలియన్ మరియు పెర్‌హీలియన్ భూమి యొక్క కక్ష్యలో (orbit) ఉన్న పాయింట్లు. భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు అఫీలియన్; భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు పెర్‌హీలియన్ అంటారు. భూమి యొక్క అఫీలియన్ సూర్యుని నుండి 94.5 మిలియన్ మైళ్ళు (152 మిలియన్ కిలోమీటర్ల) దూరంలో ఉంది. భూమి యొక్క పెర్‌హీలియన్ సూర్యుని నుండి 91.4 మిలియన్ మైళ్లు (147 మిలియన్ కిలోమీటర్ల) దూరంలో ఉంది.

సాధారణంగా, భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో (elliptical orbit) ప్రయాణిస్తుంది. కక్ష్య ఖచ్చితమైన వృత్తం (circle) కానందున, సూర్యుని నుండి భూమి యొక్క దూరం మారుతూ ఉంటుంది. అయితే, సగటున, భూమి నుండి సూర్యుడికి దూరం దాదాపు 93 మిలియన్ మైళ్లు (150 మిలియన్ కిలోమీటర్లు). ఈ సగటు దూరాన్ని ఒక ఖగోళ యూనిట్ (astronomical unit) అంటారు.

పెర్‌హీలియన్ మరియు అఫీలియన్ పోల్చినప్పుడు, దూరంలో, కేవలం 3.3% (సుమారు 5 మిలియన్ కిలోమీటర్లు) తేడా ఉంది. భూమి మరియు సూర్యుని మధ్య సగటు దూరాన్ని పరిగణించినప్పుడు, అఫీలియన్ యొక్క పెరుగుదల కేవలం 1.4% మాత్రమే. కాబట్టి, ‘అఫీలియన్ దృగ్విషయం’ కారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 66% పెరగడం అనేది తప్పు.

అఫీలియన్ మరియు పెర్‌హీలియన్ ప్రతి ఏటా జరిగే సంఘటనలు (annual events). 2022లో, అఫీలియన్, 04 జూలై 2022న జరిగింది. 04 జనవరి 2022న పెర్‌హీలియన్. అఫీలియన్ మరియు పెర్‌హీలియన్ ఏదో ఒక్క సమయంలోనే సంభవిస్తాయి ఎందుకంటే భూమి ఎప్పుడూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి, అఫీలియన్ అనేది 04 జూలై 2022 నుండి 22 ఆగస్టు 2022 వరకు జరిగే ఒక దృగ్విషయం అని క్లెయిమ్ చేయడం సరైనది కాదు.

అఫీలియన్ సూర్యుడి నుండి బాగా దూరంగా ఉన్నపటికీ వాతావరణం యొక్క వ్యవధిని ప్రభావితం చేస్తుంది కానీ తీవ్రతను కాదు. “The difference in the amount of the Sun’s energy we receive (called the solar constant) doesn’t vary considerably between perihelion and aphelion.”

NASA ప్రకారం, భూమి మరియు సూర్యుని మధ్య దూరం నాలుగు సీజన్లకు కారణమవుతుందనేది ‘సాధారణ అపోహ’ (common misconception). అయితే, భూమి యొక్క టిలటెడ్ (వంపు) ఆక్సిస్ సీజన్లలో మార్పుకు ప్రధాన కారణం.

చివరగా, అఫీలియన్ అనేది ప్రతి ఏటా జరిగే సంఘటన; వాతావరణంలో గణనీయమైన మార్పులకు ఇది ప్రధాన కారణం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll