Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ లోని రహదారి ఫోటోని తెలంగాణలో అద్భుతమైన రహదారి అని షేర్ చేస్తున్నారు

0

పచ్చని పొలాల మధ్య నుంచి వెళుతున్న రహదారి ఫోటోని చూపిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో కట్టించిన అద్భుతమైన రహదారి, అంటూ షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టించిన అద్భుతమైన రహదారి ఫోటో.

ఫాక్ట్ (నిజం):  ఫోటోలో కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల-ఆళ్లగడ్డ మధ్య నిర్మించిన రహదారి అని విశ్లేషణలో తెలిసింది. ఈ రహదారి తెలంగాణకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని పృథ్వి చౌదరి అనే ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ‘4 అక్టోబర్ 2020’ నాడు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల-ఆళ్లగడ్డ మధ్యగా వెళుతున్న రహదారి ఫోటో, అని ఈ ట్వీట్ కింద రిప్లై లో పృథ్వి చౌదరి తెలిపారు. తన డ్రోన్ కెమేరాతో తీసిన ఈ రహదారి వీడియోని  ‘7 అక్టోబర్ 2020’  నాడు పృథ్వి చౌదరి ట్విట్టర్ లో షేర్ చేసారు. రాయలసీమ అందాలు, అంటూ ఈ వీడియోని షేర్ చేసారు.ఈ వివరాల ఆధారంగా, ఫోటోలో కనిపిస్తున్న రహదారి తెలంగాణాకి సంబంధించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ లోని రహదారి ఫోటోని చూపిస్తూ తెలంగాణలో కెసిఆర్ కట్టిన అద్భుతమైన రహదారి అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll