Fake News, Telugu
 

ఫిరోజ్ ఖాన్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు చెప్తున్న పాత వీడియోను ఇటీవల చేసిన వ్యాఖ్యలుగా షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ 2023 తెలంగాణ ఎన్నికలలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అని చెప్తూ, ఎన్నికల తరువాత MIM, కాంగ్రెస్, తెరాస పొత్తు కలుస్తారు అని అంటున్న వీడియోను షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 2023 ఎన్నికలలో తెలంగాణలో ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుంది అని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు.

ఫాక్ట్: ఇది 12 జులై 2022లో ఒక ఇంటర్వ్యూలో ఫిరోజ్ ఖాన్ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు తెలుపుతున్న వీడియో. ఇవి ఇటీవల తెలిపిన అంచనాలు కావు.  కావున ఇది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో 12 జులై 2022లో Telugu Popular TV అనే YouTube ఛానల్లో చేసిన ఇంటర్వ్యూలోది అని తెలిసింది. యాంకర్ ఫిరోజ్ ఖాన్‌ను వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుంటారా అని అడగగా బీజేపీ ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుస్తుంది అని, ఎన్నికల తరువాత కాంగ్రెస్, తెరాస, MIM ఒక కూటమిగా మారతారని తన అంచనాను తెలిపారు. 

ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్ల గురించి ఇటువంటి అంచనాలు తరచుగా చెప్పడం గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). మే 2023లో చేసిన ఇంటర్వ్యూలో ఫిరోజ్, తెరాస అధిక ఓట్లు గెలుస్తుందని తన అంచనా తెలిపారు. అయితే ఇటీవల చేసిన ఇంటర్వ్యూలో, ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుస్తుందని చెప్పినట్టు గమనించాం. 

చివరిగా, ఫిరోజ్ ఖాన్ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు చెప్తున్న పాత వీడియోను ఇటీవల చేసిన వ్యాఖ్యలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll