“నిన్న DNA test లో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నబాబ్ సింగ్ యాదవ్ దోషి గా నిర్దారణ అయినాక (ఇక్కడ), అఖిలేష్ యాదవ్ ను మీడియా వారు చుట్టుముట్టగా, గేటు దూకి పారి పోవడం చూడండి,”అని చెప్తూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఒక గేటు దూకి వెళుతున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: జర్నలిస్టుల ప్రశ్నల నుండి అఖిలేష్ యాదవ్ గేటు దూకి తప్పించుకున్న దృశ్యాలని వైరల్ వీడియో చూపిస్తుంది.
ఫ్యాక్ట్ (నిజం): 2023లో స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్‌కు నివాళులు అర్పించేందుకు అఖిలేష్ యాదవ్ జయ ప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (JPNIC) సరిహద్దు గోడ గేటుపై నుంచి దూకినప్పుడు తీసిన వీడియో ఇది, ఇటీవలది కాదు. JPNIC లోకి వెళ్ళడానికి అతనికి అనుమతి నిరాకరించబడినప్పుడు,అతను జయప్రకాష్ నారాయణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు JPNIC గేటుపై నుంచి దూకినట్లు ఈ సంఘటనకి రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు తెలిపాయి. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ గురించి మరిన్ని వివరాలని తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియో ఇటీవల జరిగిన సంఘటనది కాదని, అక్టోబర్ 2023 నాటిదని మాకు తెలిసింది.
ఈ సంఘటన గురించి రిపోర్ట్ చేసిన (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వార్తా కథనాల ప్రకారం, అక్టోబర్ 2023లో, స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా, జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(JPNIC) లోపలకి వెళ్లడానికి అఖిలేష్ యాదవ్‌కు అనుమతి నిరాకరించారనే కారణంతో జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు ఆయన JPNIC గేటుపై నుంచి దూకారు.
11 అక్టోబర్ 2023న, సమాజ్‌వాదీ పార్టీ ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ‘X’లో పోస్ట్ చేసింది. “సమాజ్‌వాదీ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, సమాజ్‌వాదీ పార్టీ ఒక ఉద్యమం, తుఫాను” అని హిందీలో ఉన్న వివరణలో పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా 11 అక్టోబర్ 2023న ‘X’లో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, నవాబ్ సింగ్ యాదవ్ DNA టెస్ట్ రిజల్ట్స్, తనని ఒక మైనర్ రేప్ కేసులో నిందితుడిగా నిర్ధారించిన సంఘటననీ ఉద్దేశిస్తూ ‘అసలు మీకు DNA యొక్క పూర్తి అర్థం తెలుసా? అని అంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాల్ని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, 2023 అక్టోబర్‌లో జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి పూలమాల వేయడానికి అఖిలేష్ యాదవ్ JPNIC యొక్క గేటు దూకిన వీడియోని, ఇటీవల కొందరు జర్నలిస్టులు ఆయనను ప్రశ్నిస్తుండగా పారిపోయాడు అనే వాదనతో తప్పుగా షేర్ చేస్తున్నారు
`