Fake News, Telugu
 

ఈ ఫోటో ప్రధాని మోదీ వారణాసిలో విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కార్మికులతో కలిసి భోజనం చేస్తున్నప్పటిది, రామ మందిర నిర్మాణ కార్మికులతో కాదు.

0

“ఒక రాజు అద్భుత భవనాన్ని నిర్మించిన వారి చేతులు నరికేస్తే మరొక రాజు అద్భుత రామ మందిరం నిర్మించిన పనివారిని గౌరవించి వారితో కలిసి భోజనం చేస్తున్నాడు… ఎంత తేడా??” అని చెప్తూ, ప్రధాని మోదీ కొందరు కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ప్రధాని మోదీ రామ మందిర నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఇది. 

ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటో డిసెంబర్ 2021లో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కార్మికులతో కలిసి భోజనం చేసినప్పటిది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

తగిన కీ-వర్డ్స్ ఉపయోగించి ఈ ఫోటో గురించి ఇంటర్నెట్లో వెతకగా, డిసెంబర్ 2021 నుంచి ఈ ఫోటో కలిగిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు దొరికాయి. 

వార్తా కథనాల ప్రకారం, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్న కార్మికులతో కలిసి ప్రధాని మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 13వ డిసెంబర్ నాడు పంక్తి భోజనం చేశారు. 

చివరిగా, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కార్మికులకు ప్రధాని మోదీ కలిసి భోజనం చేసిన ఫోటోని, అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేసిన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll