Fake News, Telugu
 

పొలాండ్‌లోని సులోస్జోవా గ్రామం నిజం ఫోటో అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన ఫోటో షేర్ చేస్తున్నారు

0

పొలాండ్‌లోని క్రాకోవ్‌కు దగ్గరలో ఉన్న ‘సుశోషోవా’(సులోస్జోవా) అనే గ్రామం గురించి వివరిస్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్రామం దృశ్యాలను చూపిస్తున్న ఒక ఫోటోని కూడా ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ ఊరిలో ‘ఒక పొడవైన, పూర్తిగా నిలువుగా ఉన్న ప్రధాన రహదారి, రెండువైపులా సముచితంగా అమర్చిన ఇళ్ళు, ఉంగరంలో అమర్చిన ముత్యాల్లా కనపడతాయి.,’ అని క్లెయిమ్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: పొలాండ్‌లోని సులోస్జోవా గ్రామం ఫోటో, ఈ ఊరిలో ఇళ్ళు ఒక పొడవాటి రోడ్డుకి ఇరువైపులా సముచితంగా అమర్చినట్లు ఉంటాయి.

ఫ్యాక్ట్(నిజం): పొలాండ్‌లోని సులోస్జోవా అనే గ్రామం(commune) ఉంది. కానీ వైరల్ పోస్టులో ఉన్న ఫోటో ఆ గ్రామానిది కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసినది. సులోస్జోవాలో రోడ్డు ఒక పొడవైన పూర్తిగా నిలువైన రోడ్డు ఏమి కాదు, అలాగే ఇక్కడ రోడ్డు పొడవునా రెండువైపులా సముచితంగా అమర్చిన ఇళ్ళు ఉండవు, కొన్ని చోట్ల ఒక వైపు ఎక్కువ ఇళ్ళు ఉంటాయి, ఒక వైపు తక్కువ ఇళ్ళు ఉంటాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

ముందుగా వైరల్ పోస్టులో చెప్తున్న ఊరు గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, పొలాండ్‌లోని క్రాకోవ్‌ నగరం దగ్గర సులోస్జోవా గ్రామం (commune) (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఉంది అని మాకు తెలిసింది. ఈ గ్రామం గురించి వివరిస్తున్న  వచ్చిన కొన్ని ఆర్టికల్స్ మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఈ గ్రామానికి ఒక 9 కిలోమీటర్ల ప్రధాన వీధి ఉంది.  

కానీ ఈ గ్రామం యొక్క ఏరియల్ వ్యూ ఫోటోలలో, వీడియోలలోని దృశ్యాలు వైరల్ ఫొటోలో ఉన్నట్లు లేవు. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా ఈ ఊరి రోడ్డు అన్ని చోట్లా నిలువుగా లేదు, అలాగే సముచితంగా అమర్చిన ఇళ్ళు కూడా లేవు. కొన్ని చోట్ల రోడ్డు వొంపుగా ఉన్నది, అలాగే ఇళ్ళు కూడా వైరల్ ఫొటోలో కనిపిస్తున్నట్టు ఇరు వైపులా అన్ని చోట్ల సమాన సంఖ్యలో లేవు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). సులోస్జోవా యొక్క గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ చూస్తే ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. 

అసలు విజువల్స్, వైరల్ ఫోటో మధ్య ఈ వ్యత్యాసాన్ని గమనించి, వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటోనేమో అని మాకు అనుమానం కలిగింది. ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ అయిన సైట్ ఇంజిన్, హైవే మోడరేషన్ ద్వారా ఈ ఫొటోని అనాలిసిస్ చేసి చూసాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఇమేజ్ అని ఈ రెండు టూల్స్ నిర్ధారించాయి (ఇక్కడ, ఇక్కడ). దీని బట్టి వైరల్ అవుతున్న ఫోటో సులోస్జోవా గ్రామం నిజం ఫోటో కాదని మనకు అర్థం అవుతుంది.

చివరగా, పొలాండ్‌లోని సులోస్జోవా గ్రామం ఫోటో అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన ఫోటో షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll