Fake News, Telugu
 

AI ద్వారా జనరేట్ చేసిన ఇమేజ్ టర్కీ దేశ ప్రత్యేకమైన ‘యోగి పుష్పం’ అని షేర్ చేస్తున్నారు

0

ఒక ఫొటోతో ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ప్రకారం, ఈ ఫోటో టర్కీలో పద్మాసనం ఆకారంలో సహజంగా పెరిగిన పువ్వులను చూపిస్తోంది. ఈ అరుదైన “యోగి పువ్వు” ఉర్ఫా ప్రావిన్స్‌కు సమీపంగా ఉన్న హాల్ఫెటి గ్రామంలో మాత్రమే పెరుగుతాయని పోస్ట్ పేర్కొంది. ఈ పువ్వులు, నేల యొక్క ప్రత్యేక లక్షణాలు మరియు ఆంథోసైనిన్ వర్ణద్రవ్యాల కారణంగా pH లెవెల్  సెన్సిటివ్ ఉంటాయి. వేసవిలో నల్లగా మరియు ఇతర సీజన్లలో ఎరుపు రంగులో కనిపిస్తాయని కూడా ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ కథనంలో వాస్తవం ఎంత ఉన్నది అనే విషయం తెలుసుకుందాం.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ ఫోటో టర్కీలో దొరికే సహజ యోగి పూలను చూపిస్తుంది, అవి ప్రతి సీజన్‌ లో వారి రంగును మార్చుకుంటాయి.

ఫాక్ట్(నిజం): వైరల్ ఫోటో AI ద్వారా జనరేట్ చేయబడింది. టర్కీలో “యోగి పుష్పం” అనే  పేరుతో ఏ పువ్వు లేదు. టర్కీలోని హాల్ఫెటీలో, “కారా గుల్” అని పిలవబడే గులాబీలు లోతైన వైన్-ఎరుపు రంగులో వికసిస్తాయి, వేసవిలో మొగ్గలుగా నల్లగా కనిపిస్తాయి. వాటికి నిర్దిష్ట pH లెవెల్ అవసరమవుతాయి కాబట్టి వేసవిలో నల్లగా మారుతాయి, ఇతర సీజన్లలో షేడ్స్ మారుతాయి.  స్థానికులు ఈ గులాబీలను పండించి, పర్యాటకులకు అమ్ముతారు. టర్కీలో ‘యోగి పుష్పం’ అని పిలువబడే పద్మాసనం ఆకారంలో పెరిగిన పూల గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.

మేము ఈ ఫోటో AI ద్వారా జనరేట్ చేయబడింది అని అనుమానించాము. తదుపరి, దానిని హైవ్ AI డిటెక్టర్ ద్వారా పరీక్షించాము. ఆ టూల్, ఇది AI ద్వారా జనరేట్ చేయబడింది అని 99.9% అవకాశంతో నిర్ధారించింది.

మేము మరొక AI డిటెక్టర్ టూల్ హగ్గింగ్ ఫేస్ నీ ఉపయోగించాము, ఆ టూల్ ప్రకారం, ఇది AI ద్వారా జనరేట్ చేయబడింది అని 87% అవకాశంతో నిర్ధారించింది.

ఇకపోతే , టర్కీలోని హాల్ఫెటీలో ‘యోగి ఫ్లవర్’ అనే పేరుతో పుష్పం వికసిస్తుందని నిర్ధారించడానికి మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయితే, హాల్ఫెటీ యొక్క గులాబీలు లోతైన వైన్-రంగు ఎరుపు రంగులో వికసిస్తాయి కానీ మొగ్గలు నల్లగా కనిపిస్తాయి. టర్కిష్‌లో కారా గుల్ అని పిలువబడే ఈ గులాబీలు ప్రత్యేకమైనవి మరియు గత దశాబ్దంలో ప్రత్యేక ఖ్యాతిని పొందాయి (ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ). ఈ పూలకు ఒక నిర్దిష్ట pH లెవెల్ అవసరమవుతాయి కాబట్టి వేసవి పెరుగుతున్న కొద్దీ నల్లగా మారుతాయి. స్థానికులు వాటిని సాగు చేసి పర్యాటకులకు అమ్ముతారు.

టర్కీలో ‘యోగి పుష్పం అని పిలువబడే పద్మాసనం ఆకారంలో పెరిగిన పూల గురించి ఎటువంటి ఆధారాలు లేవు.

చివరిగా,  AI – ద్వారా జనరేట్ చేయబడిన ఒక పువ్వు ఫోటోని టర్కీ యొక్క ప్రత్యేకమైన ‘యోగి పుష్పం’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll