Fake News, Telugu
 

ఫోటో దిగుతున్న ఒక అమ్మాయిని మొసలి తిన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో ఒక యాడ్, నిజమైన సంఘటన కాదు

0

ఒక చెరువు గట్టున ఒక అమ్మాయి ఫోటో దిగుతుండగా, నీటిలో నుండి ఒక మొసలి వచ్చి తనని తినేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “కొత్త ప్రదేశాలుకు వెళ్ళినప్పుడు Alert గా ఉండాలినీటి సరస్సుల దగ్గర సెల్ఫీలు, ఫోటోలు అవసరమా? ఎంత ప్రమాదం.,” అని చెప్తూ ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఒక చెరువు దగ్గర ఫోటో దిగుతున్న అమ్మాయిని మొసలి తినేసిన వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఇది చాలా పాత 2013 నాటి వీడియో, ఫ్యాషన్ మ్యాగజిన్ ‘ప్రివ్యూ’ వారి యాడ్ క్యాంపైన్‌లో భాగంగా తీసిన ఒక యాడ్ ఫిలిం. ఇది నిజమైన సంఘటన కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో ఊరించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా. ఈ వీడియో యొక్క అసలు వెర్షన్(ఆర్కైవ్ లింక్) మాకు దొరికింది. 

ఈ వీడియోని ప్రివ్యూ మ్యాగజిన్ వారు తమ యూట్యూబ్ ఛానల్‌లో 2013లో అప్లోడ్ చేసారు.ఈ వీడియో పేరు ‘How Not To Instagram.’ ఈ వీడియో తమ ‘#imapreviewgirl’ క్యాంపైన్ కోసం తీసిన ఒక యాడ్ ఫిలిం. ఈ వీడియో వివరణలో దీని గురించి వివరిస్తూ, ఈ వీడియోను వారి #imapreviewgirl వీడియో సిరీస్ యొక్క 7వ వీడియో అని చెప్పారు.  

ప్రివ్యూ మ్యాగజిన్ వారు కొందరు ఫిలంమేకర్స్ ని ‘ప్రివ్యూ గర్ల్’ అంటే వారి దృష్టిలో ఏంటి అని చెబుతూ ఒక వీడియోను తీయమన్నారని, అందులో భాగంగానే దీన్ని చేశారు అని ఈ వీడియో వివరణలో ఉంది.

ఈ యాడ్ ఫిలిం అప్పట్లో కొన్ని అవార్డులు కూడా కైవసం చేసుకుంది.  

అసలు వీడియో ఆఖర్లో , “Choose your bag wisely” #imaPreviewgirl అని వస్తుంది. ఈ భాగాన్ని ఎడిట్ చేసి, వైరల్ వీడియోను తయారు చేసి, ఇది నిజంగా జరిగిన సంఘటన వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

చివరిగా, ఒక యాడ్ ఫిలిం యొక్క ఎడిటెడ్ వీడియోని షేర్ చేస్తూ, ఒక అమ్మాయిని మొసలి తినేసిన సంఘటనకి చెందిన నిజమైన వీడియో అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll