Deepfake, Fake News, Telugu
 

శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో, వివిధ జంతువులను వరద నీటి నుంచి కాపాడుతున్న ఏనుగుల నిజమైన దృశ్యాలని చెప్తూ, AI-జనరేటెడ్ వీడియోలను షేర్ చేస్తున్నారు

0

దిత్వా తుఫాను కారణంగా, నవంబర్/ డిసెంబర్ 2025లో శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో, ఏనుగులు రకరకాల జంతువులను వరద నీటి నుంచి కాపాడుతున్న దృశ్యాలంటూ, కొన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు, ఈ వీడియోల వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

వైరల్ వీడియోల ఆర్కైవ్డ్ వెర్షన్‌లను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నవంబర్/ డిసెంబర్ 2025లో శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో, కొన్ని ఏనుగులు కుక్క, జింక, పులి వంటి జంతువులను రక్షిస్తున్న వీడియోలు.

ఫ్యాక్ట్ (నిజం): ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు, నిజమైన వీడియోలు కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ వీడియోలలోని కొని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోలు నవంబర్/డిసెంబర్ 2025లో శ్రీలంకలో వచ్చిన వరదల సమయంలో, ఏనుగులు వివిధ జంతువులను కాపాడుతున్న దృశ్యాలని చెప్తూ, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. 

అలాగే, ఈ సెర్చ్ ద్వారా వరద నీటిలో చిక్కుకున్న కుక్కను ఏనుగు కాపాడుతున్న వీడియో, ఇంకా ఒక జింకను ఏనుగు కాపాడుతున్న వీడియో, ఈ రెండు వీడియోలున్న టిక్-టాక్‌ పోస్టులు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోల వివరణలో ‘Contains AI-generated media’ ఇంకా ‘Creator Labelled as AI-generated’ అనే రెండు ట్యాగులు ఉన్నాయి. 

ఈ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసినవని దీని అర్థం. ఈ వీడియోలు ఉన్న రెండు పేజీలలో (ఇక్కడ, ఇక్కడ) ఇటువంటి AI-జనరేటెడ్ వీడియోలు చాలా ఉన్నాయి. 

ఈ విషయాన్ని నిర్ధారించడానికి, హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ సహాయంతో ఈ వీడియోలు AI-ద్వారా రూపొందించినవా కాదా అని చెక్ చేశాము. అయితే, ఈ రెండూ AI-జనరేటెడ్ వీడియోలే అని హైవ్ గుర్తించింది (ఇక్కడ, ఇక్కడ)

ఇక ఒక ఏనుగు పైన పులి కూర్చున్న వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో AI ద్వారా రూపొందించిందని చెప్తూ, కొందరు సోషల్ మీడియా యూజర్లు చేసిన కామెంట్స్ మేము చూసాము. ఇది AI-జనరేటెడ్ వీడియోనా కాదా అని వెరిఫై చేయడానికి ఈ వీడియోను హైవ్‌లో చెక్ చేస్తే, ఇది 88.9% AI-జనరేటెడ్ విడియో అని హైవ్ గుర్తించింది.

చివరగా, శ్రీలంకలో వివిధ జంతువులను వరద నీటి నుంచి కాపాడుతున్న ఎగుగుల నిజమైన సంఘటనలని చెప్తూ, AI-జనరేటెడ్ వీడియోలను షేర్ చేస్తున్నారు 

Share.

About Author

Comments are closed.

scroll