“ఇటీవల విజయవాడ వరద ప్రాంతాల్లో జగనన్న పర్యటన సందర్భంగా కృష్ణా నది తీరం వెంబడి జగనన్న కోసం జనం భారీగా తరలివచ్చారు”, అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇదే వీడియోను గతంలో కూడా YSRCP/ వై.ఎస్.జగన్ కు ముడిపెడుతూ షేర్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: YSRCP/వై.ఎస్.జగన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో జూలై 2024లో ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో ‘ముంబై పోలీస్’ అనే లోగో ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక X(ట్విట్టర్)లో 04 జూలై 2024న షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం 04 జూలై 2024న ముంబైలో నిర్వహించిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ కు సంబంధించినవి.
ఇదే వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇదే క్యాప్షన్‌తో షేర్ చేశారు. జూలై 2024లో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ ను రిపోర్ట్ చేసిన వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాలలో కూడా వైరల్ వీడియోను పోలిన దృశ్యాలను మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ కు సంబంధించినవి అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ కు సంబంధించినవి.