Fake News, Telugu
 

2018లో నరేంద్ర మోదీను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

నన్ను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని రాహుల్ గాంధీ అన్నాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తనను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని రాహుల్ గాంధీ చెప్పాడు.

ఫాక్ట్(నిజం):  2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘తనను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని’, మోదీ అంటారని, కానీ నేను అలాంటి మాటలు మాట్లాడానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. ఐతే ఈ ప్రసంగంలో మోదీను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తొలగించి కేవలం ‘సూర్యుని దిశను మార్చే’  వ్యాఖ్యలను రాహుల్ గాంధీకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యాఖ్యలు రాహుల్ గాంధీ నిజంగానే చేసినప్పటికీ, అయన వేరే వ్యక్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయనకు సందర్భరహితంగా ఆపాదిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియో మాకు లభించింది.

2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని దొంగర్గర్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసారు. సభలో మాట్లాడుతూ తాను మోదీలాగా తప్పుడు వాగ్దానాలు చేయనని చెప్పే క్రమంలో ‘తనను ప్రధానమంత్రిని చేస్తే తూర్పున ఉదయించే సూర్యుడిని పశ్చిమాన ఉదయించేలా చేస్తానని’, మోదీ అంటారని, కానీ నేను అలాంటి మాటలు మాట్లాడానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు.

ఐతే రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రసంగంలో డిజిటల్‌గా ఎడిట్ చేసి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తొలగించి కేవలం ‘సూర్యచంద్రుల దిశను మార్చే’  వ్యాఖ్యలను రాహుల్ గాంధీకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ చేసిన వాగ్ధానాలు అని నల్లదనం, రెండు కోట్ల ఉద్యోగాల గురించి రాహుల్ గాంధీ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సభలో రాహుల్ చేసిన ప్రసంగాన్ని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, 2018లో నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll