ఆరావళి పర్వత శ్రేణుల్లో 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే ఆరావళి పర్వతాలుగా గుర్తించబడతాయని సుప్రీం కోర్టు 20 నవంబర్ 2025న చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వారి ఒక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఆరావళి పర్వతాలకి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం కారణంగా, వాటిల్లో 90% పర్వతాలను ఆరావళిలో భాగం కాకుండా చేస్తుందని (అవి ఆరావళి రక్షణ నుంచి బయటకు వస్తాయని) కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే, సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం తర్వాత, ‘సేవ్ ఆరావళి’ అనే క్యాంపైంగ్ మొదలైంది, పర్యావరణ వేత్తలు ఈ నిర్ణయానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). మరో పక్క, ఆరావళి పర్వతాల్లో 90% శాతం వరకు రక్షణలోనే ఉన్నాయని 21 డిసెంబర్ 2025న కేంద్రం తెలిపింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, ఒక సభలో పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఆరావళి పర్వత శ్రేణులపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిరేకిస్తూ జరిగిన ఒక నిరసనకు చెందిన వీడియో ఇది అని చెప్తూ సోషల్ మీడియా యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 100 మీటర్ల ఎత్తు కంటే తక్కువ ఉన్నవి ఆరావళి పర్వతాలు కావు అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ, కొందరు చేపట్టిన ఒక భారీ నిరసనకు చెందిన వీడియో ఇది.
ఫ్యాక్ట్(నిజం): నవంబర్ 2025లో రాజస్థాన్‌లోని కరౌలిలో జరిగిన ‘డుంగ్రీ డ్యామ్ మహాపంచాయత్’కు చెందిన వీడియో క్లిప్ ఇది. ఇందులో మాట్లాడుతున్న వ్యక్తి, రాజస్థాన్ రాజకీయ నాయకుడు నరేష్ మీనా. ఈ వీడియోకి, ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి జరుగుతున్న నిరసనలకు సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలున్న నవంబర్ 2025 నాటి మీడియా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ ,ఇక్కడ, ఇక్కడ).

రాజస్థాన్‌లోని బానస్ నదిపై కట్టడానికి ప్రతిపాదనలో ‘డుంగ్రీ డ్యామ్’కు వ్యతిరేకంగా 21 నవంబర్ 2025న రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ఉన్న, జోడ్లి గ్రామంలోని పవర్ హౌస్ కాంప్లెక్ష్‌లో జరిగిన ఒక ‘మహాపంచాయత్’కు చెందిన వార్తా కథనాలు ఇవి (ఇక్కడ, ఇక్కడ). ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు రాకేష్ తికాయత్, రాజకీయ నాయకుడు నరేష్ మీనాతో సహా చాలా మంది నాయకులు పాల్గొన్నారు. ‘డుంగ్రీ డ్యామ్’ కట్టడం వల్ల తమ ఇల్లు, స్థలాలు నీటమయం అయిపోతాయని, దానికి విరుద్ధంగా స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ‘మహాపంచాయత్’ సభలో పాల్గొన్నారు. ఈ సభకు సంబంధించిన వీడియో రిపోర్టులలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న స్టేజి డెకరేషన్, దూరంగా కనిపిస్తున్న వాటర్ ట్యాంకు మనం చూడవచ్చు.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హిందీలో మాట్లాడుతూ, ‘..కేవలం ప్రసంగం వినడానికి వచ్చినవాళ్ళు చేతులు పైకి ఎత్తండి..’ అని అంటాడు. ఇదే వ్యక్తి ఈ వాక్యాన్ని అంటున్న ఈ సభకు సంబంధించిన వేరే యాంగిల్స్‌లో తీసిన యూట్యూబ్ వీడియోలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వ్యక్తి రాజకీయ నాయకుడు నరేష్ మీనా. ఈ కార్యక్రమంలో తను చేసిన ప్రసంగం నరేష్ మీనా యొక్క యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఉంది. దీనిబట్టి, ఈ వీడియో ‘సేవ్ ఆరావళి’ నిరసనలకు చెందినది కాదని మనకు స్పష్టం అవుతుంది.
అలాగే, వైరల్ పోస్ట్ యొక్క వివరణలో, ‘ఢిల్లీలో పొగ మంచుకు కారణం ఆరావాలి పర్వతాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు వాటిని 100 మీటర్లు తగ్గించమని ఒక ఆదేశాన్ని ఇచ్చింది.,’ అని ఉంది. అయితే, ఇందులో వాస్తవం లేదు.
సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న రెండు కేసుల విషయంలో ఆరావళి పర్వతాలకు ఒక సరైన నిర్వచనం (definition/classification) ఇవ్వాలి అన్న విషయాన్ని సుప్రీం కోర్టు (Suo Moto)గా తీసుకొని, ఆరావళి పర్వత శ్రేణులకు ఒక సరైన నిర్వచనం ఇవ్వాలనే విషయం నిమిత్తమై, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు వారు ఈ కొత్త నిర్వచనాన్ని ఆమోదించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

చివరగా, నవంబర్ 2025లో రాజస్థాన్‌లోని కరౌలిలో జరిగిన ‘డుంగ్రీ డ్యామ్ మహాపంచాయత్’కు చెందిన వీడియో క్లిప్పును ‘సేవ్ ఆరావళి’ నిరసనకు తప్పుగా ముడిపెడుతూ షేర్ చేసున్నారు

