ఇజ్రాయెల్ ఒక బాలుడిని హమాస్ చంపినట్టు నకిలీ వీడియోను రూపొందిస్తోంది అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఇజ్రాయెల్ ఉగ్రవాదులు హమాస్ దాడి చేసినట్టు ఫేక్ వీడియోను చిత్రీకరిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 19 ఏప్రిల్ 2022 తేదీ నాటి ‘Empty Place’ అనే పేరుతో పాలస్తీనాకు చెందిన ఫిల్మ్ మేకర్ అయిన అవనీ ఎష్టైవే దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీడియోలోని ఒక క్లిప్. కావున, ఈ పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వీడియోలో కనిపిస్తున్న టిక్ టాక్ యూజర్ (@Mohamad awawdeh) పేరును వెతకగా, awawdehproduction అనే టిక్ టాక్ పేజీలో 21 ఏప్రిల్ 2022లో ఈ వీడియో పోస్టు చేస్తూ, అరబీలో ‘బాల ఖైదీ అహ్మద్ మానస్రా కథకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ’ అని రాస్తూ షేర్ చేయడం గమనించాం.
తరువాత, కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ గురించి వెతకగా, ఇది 19 ఏప్రిల్ 2022 తేదీ నాటి “Empty Place” అనే పేరుతో పాలస్తీనాకు చెందిన ఫిల్మ్ మేకర్ అయిన అవనీ ఎష్టైవే దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ అని YouTube ద్వారా కనుగొన్నాం. షార్ట్ ఫిల్మ్‌లో 1:15 సమయం దగ్గర దృశ్యం వైరల్ అవుతున్న వీడియోకు అనుగుణంగా ఉంది అని గమనించాం. ‘ఈ చిత్రం ఒక ఆక్రమణ కారణంగా వదిలిన అన్ని విలీన స్థలాలను చూసే ఒక విన్డో, అహ్మద్ మనాసరాను మాత్రం కాదు, ప్యాలిస్టైన్లో 105,000 మరణికుల మరియు గాయపడినవారి “Empty Place” కు సంబంధించినవి.’ అంటూ వివరణలో పేర్కొన్నారు.
ఈ షార్ట్ ఫిల్మ్‌లోని సన్నివేశం 2015లో వైరల్ అయిన గాయపడిన మనస్రా వీడియోను వర్ణిస్తుంది (ఇక్కడ మరియు ఇక్కడ).
చివరిగా, ఇజ్రాయెల్ వారు ఫేక్ వీడియోను చిత్రీకరిస్తున్నారు అంటూ పాలస్తీనా షార్ట్ ఫిల్మ్ ‘Empty Place’ లోని ఒక దృశ్యాన్ని షేర్ చేస్తున్నారు.