Fake News, Telugu
 

ఒక అమ్మాయి తన సొంత బాబాయిని పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

షెహనాజ్ అనే ఒక అమ్మాయి ఇమ్రాన్ అనే పేరు గల తన సొంత బాబాయిని పెళ్లి చేసుకుంది అని క్లెయిమ్ చేస్తూ ఒక జంట యొక్క వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ,ఇక్కడ, ఇక్కడ). వాళ్లిద్దరూ కెమెరా వెనుక ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ, వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని, తమ కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని ఒప్పుకోవట్లేదు అని చెప్పడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక అమ్మాయి తన సొంత బాబాయిని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది. 

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. ఈ వీడియోను అంకిత కరోటియా అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మరియు ఫేస్‌బుక్ పేజిలో అప్లోడ్ చేశారు. కావున, వైరల్ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి అందులోని కొన్ని కీ  ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేయగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ (అర్చైవ్ లింక్) మాకు లభించింది. దీన్ని ‘Ankita Karotiya 2.0’ అనే ఫేస్‌బుక్ పేజీ వారు 23 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేశారు. 

తన పేజీ యొక్క వివరణలో తను ఒక యాక్టర్, డిజిటల్ క్రియేటర్ అని ‘Ankita’ పేర్కొన్నారు. ఇదే వీడియోని తను తన యూట్యూబ్ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేశారు. 

అంకిత యొక్క ఇన్స్టాగ్రామ్ పేజిలో యొక్క బయోలో, తను ఒక వీడియో క్రియేటర్ అని అలాగే ఢిల్లీకి చెంది ఒక ప్రాంక్‌స్టర్ అని రాసి ఉంది.

తన యూట్యూబ్ ఛానల్‌లో అంకిత చాలా స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి అంకిత అప్లోడ్ చేసిన వేరే వీడియోలో కూడా నటించాడు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ఛానల్‌లో ఉన్న చాలా వీడియోలలో నటీనటులు రిపీట్ అవ్వడం కూడా మీరు గమనించవచ్చు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). గతంలో అంకిత కరోటియా చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని నిజమైన సంఘటన అని చెప్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు, మేము అది తప్పు అని చెప్తూ ఒక ఆర్టికల్ ప్రచురించాము, దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, ఒక అమ్మాయి తన సొంత బాబాయిని పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll