Fake News, Telugu
 

నోయిడాలో హనుమాన్ జయంతి సందర్భంగా తీసిన వీడియోని జమ్మూలో హిందువులు నుపుర్ శర్మకు మద్దతుగా చేస్తున్న ర్యాలీ అని షేర్ చేస్తున్నారు

0

జమ్మూలో హిందువులు నుపుర్ శర్మకు మద్దతుగా ర్యాలీ తీసినట్టు ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జమ్మూలో హిందువులు నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో నోయిడాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపులో భాగంగా తీసింది. 17 ఏప్రిల్ 2022న నోయిడాలో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ మరియు విశ్వహిందూ పరిషత్ భారీ ఊరేగింపును నిర్వహించాయి. కొంతమంది ముస్లింలు నోయిడాలో అలాంటి ఊరేగింపులో పాల్గొన్న ప్రజలకు నీళ్లు మరియు ఆహార పథార్థాలు కూడా అందించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నూపుర్ శర్మకు మద్దతుగా ర్యాలీలు జరిగినప్పటికీ, ఈ వైరల్ వీడియో ఇటీవల ర్యాలీలకు సంబంధించినది కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియో 18 ఏప్రిల్ 2022న ‘RSS Noida’ అనే పేజీ ద్వారా అప్‌లోడ్ చేయబడింది. అంటే ఆ వీడియో దాదాపు రెండు నెలల కిందటిది. దీనికి, ఇటీవల నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదు.

ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం, వైరల్ వీడియో నోయిడాలో హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి వేడుకలలో భాగంగా తీసింది. సంబంధిత కీ–వర్డ్స్ తో  ఆన్‌లైన్‌లో వెతకగా, యూట్యూబ్ ఛానెల్ – ‘జన్ జోష్ న్యూస్’ – విజువల్స్ నోయిడాకు చెందినవని తెలిపింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నోయిడాలో విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది. ఊరేగింపు వీడియోను విశ్వ హిందూ పరిషత్ నోయిడా యొక్క ఫేస్‌బుక్ పేజీలో కూడా చూడవచ్చు.

17 ఏప్రిల్ 2022న నోయిడాలో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ భారీ ఊరేగింపును నిర్వహించాయి. నోయిడాలో ఊరేగింపులో పాల్గొనే ప్రజలకు కొంతమంది ముస్లింలు నీళ్లు మరియు ఆహార పథార్థాలు అందించారు కూడా. కాబట్టి, ఈ వీడియో నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించినది కాదు.

కొన్ని వార్తా కథనాల ప్రకారం, దేశంలోని కొన్ని ప్రాంతాలలో నుపుర్ శర్మకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అయితే ఈ వైరల్ వీడియో మాత్రం ఇటీవల జరిగిన అలాంటి ర్యాలీలకు సంబంధించినది కాదు.

చివరగా, నోయిడాలో హనుమాన్ జయంతి సందర్భంగా తీసిన వీడియోను జమ్మూలో హిందువులు నుపుర్ శర్మకు మద్దతు చేస్తున్న ర్యాలీ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll