“ఢిల్లీలో డెవలప్మెంట్ ఏ రేంజ్ లో ఉందో చూపించే ఒక చిత్రం” అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నరు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నీటితో నిండి ఉన్న ఇంట్లో కేజ్రివాల్‌ను టీవీలో చూస్తున్న ఒక వ్యక్తి ఫోటో.
ఫాక్ట్: ఫోటోలో ఉన్న వ్యక్తి ఫిలిపీన్స్‌కు చెందిన విక్టర్ జోస్ టాడియా. 2020లో టైఫూన్ గొని వల్ల అతని ఇంట్లో నీళ్ళు వచ్చి చేరటంతో అతన సరదాగా అలా కూర్చొని నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడు. 01 నవంబర్ 2020న, సూపర్ టైఫూన్ గోని ఫిలిపీన్స్‌లోని ఒక ద్వీపంవద్ద ల్యాండ్ ఫాల్ చేసి పెద్ద బీభత్సం సృష్టించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లు నీళ్ళ తో జలమయం అయ్యాయి. దీనివల్ల నగరం అంతటా ట్రాఫిక్ జామ్ లు సంభవించాయి. చాలా మంది తమ ఇంట్లోకి నీళ్ళు వచ్చి చేరటంతో సోషల్ మీడియాలో తమ బాధని షేర్ చేసుకున్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటోలు ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. ఆ ఫోటోల్లో ఉన్న అతను ఫిలిపీన్స్‌కు చెందిన విక్టర్ జోస్ టాడియా అనబడే వ్యక్తి అని, టైఫూన్ గొని వల్ల అతని ఇంట్లో నీళ్ళు వచ్చి చేరాయని తెలుస్తుంది. టైఫూన్ వచ్చినా గానీ తన ఇంట్లో కరెంటు ఉండటంతో అతన సరదాగా అలా కూర్చొని నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడని తెలిపారు.
విక్టర్ జోస్ టాడియా తన ఫేస్బుక్ అకౌంట్‌లో ఇటువంటి మరిన్ని ఫోటోలు షేర్ చేసినట్టు తన 01 నవంబర్ 2020 పోస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇంకా కొన్ని ఆర్టికల్స్‌లో కూడా విక్టర్ జోస్ టాడియా గురించి మరియు అతని ఫోటోల గురించి రాయటం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
01 నవంబర్ 2020న, సూపర్ టైఫూన్ గోని ఫిలిపీన్స్‌లోని ఒక ద్వీపంవద్ద ల్యాండ్ ఫాల్ చేసింది, పెద్ద బీభత్సం సృష్టించింది.
పోస్టులోని ఫోటోను మరియు విక్టర్ జోస్ టాడియా తన ఫేస్బుక్ అకౌంట్‌లోని ఫోటోలను పోల్చి చూసినప్పుడు ఫోటోను మార్ఫ్ చేసినట్టు చూడొచ్చు.
రెండు రోజుల క్రితం ఢిల్లీలో భారీవర్షాలు కురవడంతో రోడ్లు నీళ్ళతో జలమయం అయ్యాయి. దీనివల్ల నగరం అంతటా ట్రాఫిక్ జామ్ లు సంభవించాయి. చాలా మంది తమ ఇంట్లోకి నీళ్ళు వచ్చి చేరటంతో సోషల్ మీడియాలో తమ బాధని షేర్ చేసుకున్నారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
చివరగా, 2020లో టైఫూన్ వల్ల ఇంట్లో నీళ్ళు వచ్చి చేరటంతో సరదాగా కూర్చొని నెట్‌ఫ్లిక్స్ చూస్తున్న ఫోటోను మార్ఫ్ చేసి ఢిల్లీకి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.