Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటోను ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ప్రధాని నరేంద్ర మోదీ, AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తుంటే, AIMIM మహారాష్ట్ర నాయకుడు, ఇంతియాజ్ జలీల్ పక్కన కూర్చొని ఉన్న ఫోటోను, ‘ఇంత క్లోజ్ గా ఉన్నారు, మరి హిందూ భజన ఎందుకు?’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవాన్ని ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్న ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్న ఈ ఫోటో నినిజమైనది కాదు. రెండు వేరు వేరు ఫోటోలను క్రాప్ చేసి మార్ఫ్ చేసిన ఫోటో. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు. 

ఈ క్లెయిమ్ గురించి తెలుసుకోవటానికి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతికితే ఇటువంటి సమావేశం జరిగినట్టు ఏ న్యూస్ రిపోర్టు తెలుపలేదు. ఈ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇది ఎడిట్ చేసిన ఫోటో అని తెలిసింది. ఒవైసీ మరియు ఇంతియాజ్ ఉన్న ఫోటో,  ఒవైసీ 2022లో ఇఫ్తార్ విందు సందర్భంగా ఇంతియాజ్ ఇంటికి వెళ్ళిన సందర్భంలో తీసింది. ఈ ఫోటోను AIMIM పార్టీకి చెందిన షరీక్ నక్ష్బంది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చెయ్యటం గమనించాం. 

ప్రధాని మోదీ యొక్క చిత్రం, కెనడాకు చెందిన రాజకీయవేత్త, ఆండ్రూ స్కీర్ 2018లో ప్రధాని మోదీని కలిసినప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలోనిది (ఇక్కడ మరియు ఇక్కడ).

అయితే, ఈ ఫొటోలో, మోదీని మాత్రమే క్రాప్ చేసి, తరువాత ఫ్లిప్ చేసి ముందు ఫొటోలో, షరీక్ కూర్చున్న స్థానంలో ఫ్లిప్ చేసిన మోదీ ఫోటోను పెట్టారు. కింద ఉన్న GIF ఈ ఫోటోను ఎడిట్ చేసిన విధానాన్ని చూపిస్తుంది. 

చివరిగా, మార్ఫ్ చేసిన ఫోటోను  ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll