Fake News, Telugu
 

మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉంది

0

మతమార్పిడి బిల్లును కొట్టివేసిన సుప్రీంకోర్టు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, పౌర స్వేచ్చను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తిర్పిచ్చినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టిపారేసింది.

ఫాక్ట్ (నిజం): 2021 ఏప్రిల్ నెలలో బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ్ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకొనే హక్కు ఉందని, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌ అని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, 2022 జనవరి నెలలో బలవంతపు మత మార్పిళ్లను చట్ట వ్యతిరేక నేరంగా పరిగణించాలని అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో మళ్ళీ పిటిషన్ ధాఖలు చేశారు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, 2021 ఏప్రిల్ నెలలో బీజేపీ నాయకుడు మరియు న్యాయవాధి అశ్విని ఉపాధ్యాయ్ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసినట్టు తెలిసింది. “ఇది ఎటువంటి రిట్ పిటిషన్? 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? రాజ్యాంగంలో ‘ప్రచారం’ అనే పదం ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీనిపై నీకు మేము భారీ జరిమానా విధించగలం”, అని ధర్మాసనం పిటిషనర్‌పై మండిపడినట్టు పలు వార్తా సంస్థలు 2021 ఏప్రిల్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

అయితే, 2022 జనవరి నెలలో తమిళనాడులో 17 సంవత్సరాల లావణ్య అనే యువతి ఆత్మహత్య తరువాత, అశ్విని ఉపాధ్యాయ్ బలవంతపు మత మార్పిళ్లను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు తుదితీర్పు ఇంకా వెల్లడించలేదు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే మత మార్పిళ్ల నిరోధక చట్టాలు అమలులో ఉన్నాయి. మత మార్పిళ్లను నిరోధించడానికి వివధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టులలో ధాఖలైన కేసుల స్థితిని తెలిజేయలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు కూడా ఇచ్చింది.

చివరగా, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll