“కర్ణాటక రాష్టంలో ఒక పోలీస్ ఆఫీసర్ నీ ఇష్టం వచ్చినట్టు మంత్రి వాగితే..ఆయన మంత్రి అని కూడా చూడకుండా చెంప చెల్లు మనిపించిన పోలీస్ అధికారి..” అంటూ పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని కోసుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ) షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ మంత్రిపై చెయ్యి చేసుకున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 2013లో జరిగింది, కర్ణాటకలో కాదు. బొగ్గు కార్మిక పాలసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న Nationalist Congress Party (NCP) నాయకుడు ప్రమోద్ మొహద్ను DYSP బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. ప్రమోద్ మొహద్ మంత్రి అని తెలిపే ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఈ పోస్టు తప్పుదారి పట్టిస్తుంది.
ముందుగా, ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇది వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ డైలీమోషన్‌లో టీవీ9 మరాఠీ 2013లో ప్రచురించిన వీడియోకు దారి తీసింది. “Chandrapur DYSP Ganesh Gawade BADLY Beaten Up to NCP Leader-TV9” అనే శీర్షికతో ఇది ప్రచురించబడింది.

దీన్ని ఆధారంగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, NEWS9 ప్రచురించిన వార్తకు దారి తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 2013లో జరిగింది. బొగ్గు కార్మిక పాలసీకి వ్యతిరేకంగా పార్టీ మద్దతుదారులతో కలిసి నిరసన తెలుపుతున్న NCP నాయకుడు ప్రమోద్ మోహద్ ని DYSP బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని మీడియా నివేదికలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలో చెప్పినట్టుగా ప్రమోద్ మొహద్ మంత్రి అని తెలిపే ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు (ఇక్కడ, ఇక్కడ).
చివరిగా, 2013లో మహారాష్ట్రలో ఒక పోలీస్ అధికారి NCP నాయకున్ని కొడుతున్న సంఘటనను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.

