‘మీ జీవితంలో ఈ దృగ్విషయాన్ని చుచే ఏకైక సంవత్సరం ఇది. డిసెంబర్ క్యాలెండర్ 5 ఆదివారం 5 సోమవారం 5 మంగళవారం ఇది 823 సంవత్సరాలు ఒక్కసారి మత్రమే జరుగుతుంది. చైనీయులు దినిని Bag Full Of Money అని పిలుస్తారు ఇ మేస్సజ్ స్నేహితులందరీకి పంపితే అదృష్టం మిమ్మలని వెతుక్కుంటు వస్తాదని చైనీయుల నమ్మకం మిరు కుడా మీ మిత్రులకు షేర్ చేయ్యండి!’ అని చెపుతూ ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు ని చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్టులో పేర్కొన్న విషయంలో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: డిసెంబర్ నెలలో ఐదు ఆదివారాలు, ఐదు సోమవారాలు మరియు ఐదు మంగళవారాలు రావడం ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే సంఘటన.
ఫాక్ట్ (నిజం): డిసెంబర్ నెలలో ఐదు ఆదివారాలు, ఐదు సోమవారాలు మరియు ఐదు మంగళవారాలు ఉండడం అనేది అసాధారణమైన సంఘటన కాదు. అలాంటి సంఘటన ప్రతి కొన్ని సంవత్సరాలకు డిసెంబరులో జరుగుతుంది. కావున, పోస్టులో అటువంటిది ప్రతి 823 సంవత్సరాలకు మాత్రమే జరుగుతుందనడం తప్పు.
2019 డిసెంబర్ నెలలో ఐదు ఆదివారాలు, ఐదు సోమవారాలు మరియు ఐదు మంగళవారాలు ఉన్నాయి. కానీ, అలా ఉండడం అసాధారణమేమీ కాదు. ఇది ప్రతి కొన్ని సంవత్సరాలకు డిసెంబరులో వస్తుంది. గతంలో 2013 డిసెంబర్ నెలలో ఇలానే ఉండడం చూడవచ్చు.
మరియు 2019 తర్వాత మళ్ళీ 2024 డిసెంబర్ లో జరుగుతుంది.
కావున, ఇటువంటి సంఘటన ప్రతి 823 సంవత్సరాలకు మాత్రమే జరుగుతుందనడం అవాస్తవం.
చివరగా, డిసెంబర్ నెలలో ఐదు ఆదివారాలు, ఐదు సోమవారాలు మరియు ఐదు మంగళవారాలు రావడం ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే సంఘటన కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: డిసెంబర్ నెలలో 5 ఆదివారాలు, 5 సోమవారాలు మరియు 5 మంగళవారాలు రావడం ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్ర