మరణించి ఉన్న తల్లి నుంచి పాలు తాగుతున్న ఓ బాలుడి ఫోటోను పెట్టి , లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది వలస కార్మికులు చనిపోతున్నా పటించుకొని మీడియా, సెలబ్రిటీ వాళ్ళు ఒక ఏనుగు చనిపోయినప్పుడు ఇంతలా ఎందుకు స్పందిస్తున్నారు, అని ప్రశ్నిస్తూ కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
క్లెయిమ్: లాక్ డౌన్ సమయంలో మరణించిన వలస కార్మికురాలి బాలుడు ఆకలితో, చనిపోయి ఉన్న తన తల్లి పాలు తాగుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటో 2017లో తీసినది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన తన తల్లి పాలను ఆకలితో ఉన్న తన కుమారుడు తాగుతున్న సమయంలో చిత్రీకరించిన ఫోటో అది. కావున, పోస్టులోని క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న మొదటి ఫోటో ఓపెన్ చేసి చూస్తే, అది 25 మే 2017న ప్రచురించిన కథనంగా తెలుస్తుంది. అదే శీర్షిక తో గూగుల్ లో వెతికితే ‘Metro’న్యూస్ ప్రచురించిన కథనం దొరుకుతుంది. పోస్టులోని ఇంకో ఫోటో చూస్తే, అది 25 మే 2017న ‘India Today’ ప్రచురించిన కథనం నుంచి తీసుకుంది అని గుర్తించొచ్చు. ఈ కథనాల ఆధారంగా, 2017లో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో, దామో జిల్లాలో రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన తన తల్లి పాలను బాలుడు తాగుతున్నప్పటి ఫోటో అని తెలుస్తుంది.
ఇదే సంఘటన పై 25 మే 2017న సాక్షి టీవీ ప్రసారం చేసిన వీడియో కథనం ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, మూడు సంవత్సరాల క్రితం మరణించిన మహిళ, తన పాలు తాగుతున్న బాలుడి ఫోటోలను ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో మరణించిన వలస కార్మికురాల ఫొటోలుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?