Fake News, Telugu
 

ఆగస్టు 2025లో భారీ వర్షాలకు ముంబై విమానాశ్రయం నీట మునిగిన దృశ్యాలంటూ 2023లో చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను షేర్ చేస్తున్నారు

0

ఆగస్టు 2025లో ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, భారీ వర్షాల కారణంగా ముంబై విమానాశ్రయం నీట మునిగిన దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవలి ఆగస్టు 2025లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై విమానాశ్రయం నీట మునిగిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ముంబై విమానాశ్రయానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను పలు మీడియా సంస్థలు డిసెంబర్ 2023లో రిపోర్ట్ చేస్తూ యూట్యూబ్‌లో కథనాలు ప్రసారం చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను చూపిస్తుంది.

అలాగే, వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, విమానాశ్రయం యొక్క జియో కోఆర్డినేట్‌లను (అక్షాంశాలు & రేఖాంశాలు latitude & longitude)) చూపిస్తున్న బోర్డును వీడియోలో మనం గమనించవచ్చు. ఈ కోఆర్డినేట్‌లను జియోలొకేట్ చేసినప్పుడు, ఇవి చెన్నై విమానాశ్రయం యొక్క కోఆర్డినేట్‌లు అని తెలిసింది. ఈ వైరల్ వీడియో ముంబై విమానాశ్రయానికి సంబంధించినది కాదని మనం నిర్ధారించవచ్చు.

ముంబైలో భారీ వర్షాల కారణంగా 250 కి పైగా విమానాలు ప్రభావితమయ్యాయని, అనేక  విమానాలను ఇతర నగరాలకు మళ్లించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

చివరగా, ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll