హైదరాబాద్ నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధించబోతున్న తెలంగాణ ప్రభుత్వం, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్ నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తునట్టుగా రిపోర్ట్ చేసిన న్యూస్ వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని ‘Siasat’ న్యూస్ ఛానల్ జూన్ 2020లో పబ్లిష్ చేసింది. హైదరాబాద్ నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తునట్టు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి ప్రెస్ రిలీజ్ జారీ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో పై కనిపిస్తున్న ‘Siasat Express’ వాటర్ మార్క్ బట్టి, ఈ వీడియోని హైదరాబాద్ కి చెందిన ‘Siasat TV’ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసినట్టు అర్ధమవుతుంది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘Siasat TV’ న్యూస్ ఛానల్ 28 జూన్ 2020 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. GHMC పరిధిలో మళ్ళీ లాక్ డౌన్ అమలు చేసే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తునట్టు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి ప్రెస్ రిలీజ్ జారీ చేయలేదు. దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ నియమాలని అమలులోకి తీసుకొచ్చాయి. కాని, తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తునట్టు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు.
చివరగా, 2020లో పబ్లిష్ అయిన న్యూస్ వీడియోని చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తునట్టుగా షేర్ చేస్తున్నారు.