Fake News, Telugu
 

2018 వీడియోని ఇటీవల ఫ్రాన్స్ టీచర్ ని హతమార్చిన ముస్లిం వ్యక్తి అంత్యక్రియలంటూ షేర్ చేస్తున్నారు

0

మహమ్మద్ ప్రవక్త ని అవమాన పరిచాడని, ఒక ఫ్రాన్స్ టీచర్ ని ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. హత్య చేసిన ముస్లిం యువకుడిని ఫ్రాన్స్ పోలీసులు వెంటనేకాల్చి చంపారు. అయితే, ఫ్రాన్స్ టీచర్ ని చంపిన ఆ ముస్లిం వ్యక్తి అంత్యక్రియలు చెచన్య లో ఘనంగా చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫ్రాన్స్ టీచర్ ని చంపిన హంతకుడి అంత్యక్రియలు చెచన్య లో ఘనంగా చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2018లో, చెచన్య దేశానికి చెందిన యూసుఫ్ అనే వ్యక్తి అంత్యక్రియలకి సంబంధించిన వీడియో అది. రష్యా మిలిటరీ ఆఫీసర్ ని హత్య చేసాడని యూసుఫ్ కు అక్కడి కోర్ట్ 15 సంవత్సరాలు జైలు శిక్ష విదించింది. ఈ శిక్ష సమయంలో, యూసుఫ్ గుండె పోటుతో జైలులోనే మరణించాడు. ఈ వీడియోకి ఇటివల ఫ్రాన్స్ దేశంలో జరిగిన ఘటనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్తులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, వీడియో లోని అవే దృశ్యాలని  చూపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు, వీడియోలు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. చెచన్య లో యుసుప్ తెమేర్ఖనొవ్ అనే వ్యక్తి అంత్యక్రియలకి సంబంధించిన వీడియో అని అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా, పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, వీడియోలోని ఒక దృశ్యాన్ని షేర్ చేస్తూ ఒక రష్యన్ న్యూస్ వెబ్సైటు ‘10 ఆగష్టు 2018’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. చెచన్య కి చెందిన యుసుప్ తెమేర్ఖనొవ్ అనే వ్యక్తి అంత్యక్రియలకి సంబంధించిన ఫోటో అని ఆ ఆర్టికల్ లో తెలిపారు.

యూరి బుడనోవ్ అనే రష్యన్ కల్నల్ ని హత్య చేసాడని, యుసుప్ కు అక్కడి కోర్ట్ 15 సంవత్సరాలు జైలు శిక్ష విదించింది. ఈ శిక్ష సమయంలో, యుసుప్ గుండె పోటుతో జైలులోనే మరణించాడని BBC న్యూస్ వెబ్సైటు తమ ఆర్టికల్ తెలిపారు. చనిపోయిన యుసుప్ తెమేర్ఖనొవ్ అంతక్రియలకి చెచెన్ గ్రామా ప్రజలు భారీగా హజరైనట్టు మరొక రష్యన్ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తూ ఫ్రాన్స్ టీచర్ హతమార్చిన ముస్లిం వ్యక్తి అంత్యక్రియలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll