Fake News, Telugu
 

ఈ వీడియో 2018 లో డిఎంకె లీడర్ సెల్వ కుమార్ ఒక సెలూన్ ఓనర్ పై దాడి చేసినప్పటిది

0

“డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై దాడి చేసిన డీఎంకే లీడర్ సెల్వ కుమార్” అని క్లెయిమ్ చేస్తూ  ఒక వీడియో సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. కానీ, FACTLY విశ్లేషణలో ఆ వీడియో లోని సంఘటన 2018 లో జరిగిందని, ఆ వీడియోలో దాడి చేయబడ్డది మహిళ డాక్టర్ కాదని తెలిసింది. కొన్ని న్యూస్ రిపోర్టుల కథనం ప్రకారం ఆ దాడి పెరంబలూర్ (తమిళనాడు) లోని  ఒక సెలూన్ లో 2018 లో చోటు చేసుకుంది. ఆ వీడియో లో ఉన్న స్త్రీ ఆ సెలూన్ ఓనర్, సెల్వ కుమార్ తో ఆమెకు ఆర్థిక తగాదాలు ఉన్నాయి. ఆ వీడియో 2018 లో వైరల్ అవ్వడం తో  సెల్వ కుమార్ ని డీఎంకే పార్టీ నుండి సస్పెండ్ కూడా చేసారు మరియు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ANI ట్వీట్ – https://twitter.com/ANI/status/1040148919232028673
2. న్యూస్ ఆర్టికల్ – https://www.thenewsminute.com/article/dmk-man-kicks-assaults-woman-tn-beauty-parlour-party-suspends-him-88284
3. న్యూస్ ఆర్టికల్ – https://timesofindia.indiatimes.com/videos/city/chennai/on-cam-dmk-leader-kicks-woman-at-a-beauty-parlour-arrested/videoshow/65798243.cms

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll