Fake News, Telugu
 

ఒక వ్యక్తి స్నానం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకుడు నీళ్ళు పోస్తున్న ఈ ఫోటో దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించింది కాదు

0

ఒక వ్యక్తి స్నానం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకుడు ఒకరు నీళ్ళు పోస్తున్న ఫోటోని కొందరు సోషల్ మీడియాలో పెట్టి, దుబ్బాక ఉపఎన్నికలో ఓట్ల కోసం టీఆర్ఎస్ తిప్పలు అని షేర్ చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక 03 నవంబర్ 2020 న జరగనుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దుబ్బాక ఉపఎన్నికలో ఓట్ల కోసం ఒక వ్యక్తి స్నానం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకుడు ఒకరు నీళ్ళు పోస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన ఫోటో పాతది. అది 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇల్లందు నియోజికవర్గంలో తీసిన ఫోటో. దుబ్బాక ఉపఎన్నికకు, ఆ ఫోటోకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని అక్టోబర్ 2018 లో ‘డెక్కన్ క్రానికల్’ వారు తమ ఆర్టికల్ లో పెట్టినట్టు చూడవొచ్చు. ఆ ఫోటోలో ఉన్నది టీఆర్ఎస్ లీడర్ కోరం కనకయ్య అని, 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇల్లందు నియోజికవర్గంలో ఆ ఫోటో తీసినట్టు తెలుస్తుంది. అయితే, ఆ ఫోటోని ‘ANI’ వారి దగ్గర నుండి తీసుకున్నట్టుగా ఆ ఫోటో కింద రాసి ఉంటుంది. ‘ANI’ వారు కూడా ఆ ఫోటోని అక్టోబర్ 2018 లోనే పోస్ట్ చేసినట్టుగా ఇక్కడ చూడవొచ్చు. ఆ ఫోటోకి సంబంధించిన వీడియోని ‘న్యూస్18 – తెలుగు’ వెబ్సైటులో చూడవొచ్చు.

చివరగా, ఒక వ్యక్తి స్నానం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకుడు నీళ్ళు పోస్తున్న ఫోటో దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించింది కాదు. అది 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇల్లందు నియోజికవర్గంలో తీసిన ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll