
ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘నిన్న (16 జూన్ 2020) న భారత్ – చైనా సరిహద్దు లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు’ అని దాని గురించి చెప్తున్నారు. ఆ వీడియోని ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో చాలా మంది షేర్ చేస్తున్నారు. భారత్ మరియు చైనా సైన్యాల మధ్య 15 జూన్ 2020న గాల్వాన్ వ్యాలీ లో జరిగిన ఘర్షణల్లో సుమారు ఇరవై మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోస్టు లోని వీడియో పాతదని FACTLY విశ్లేషణ లో తెలిసింది. ఆ వీడియో ని ‘Times of India’ వార్తా సంస్థ ‘19 ఆగష్టు 2017’ న తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఆ న్యూస్ వీడియో ప్రకారం, అది ‘15 ఆగష్టు 2017’ న లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు దగ్గర భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించిందని తెలుస్తుంది. కావున, పోస్టు లోని వీడియో ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తలకు సంబంధించినది కాదు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=V7szW8u52I0
Did you watch our new video?