Fake News, Telugu
 

ఇవి CAB కు మద్దతుగా హిమాచల్ ప్రదేశ్, మహరాష్ట్రలో ప్రజలు చేపట్టిన ర్యాలీల ఫోటోలు కావు.

2

ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలని పెట్టి, ‘CAB కు మద్దతుగా హిమాచల్ ప్రదేశ్ అలాగే మహరాష్ట్రలో ప్రజలు అధికంగా భారీ సంఖ్యలో ర్యాలీలు చేప్పటారు. కానీ ఏ మీడియా చూపించలేదు.. జై హింద్ జై భారత్….’ అని పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పౌరసత్వ సవరణ బిల్లు (CAB) కి మద్దతుగా హిమాచల్ ప్రదేశ్ మరియు మహరాష్ట్ర ప్రజలు చేపట్టిన ర్యాలీలకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలు మహరాష్ట్ర లో ‘మరాఠా’ రిజర్వేషన్ కోసం 2016 లో ఆ సామాజిక వర్గీయులు ర్యాలీలు చేపట్టినప్పటివి. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.

పోస్టులోని ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అవి మహరాష్ట్ర లో ‘మరాఠా’ రిజర్వేషన్ కోసం ఆ సామాజిక వర్గీయులు చేపట్టిన ర్యాలీలవని తెలిసింది.

ఫోటో-1:
ఈ ఫోటో అక్టోబర్ 2016 లో మహారాష్ట్ర లోని సంగ్లీ లో జరిగిన ‘మరాఠా’ రిజర్వేషన్   ర్యాలీదని ‘India Today’ కథనం ద్వారా తెలుస్తుంది.

ఫోటో-2:
ఈ ఫోటో సెప్టెంబర్ 2016 లో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లో జరిగిన ‘మరాఠా’ రిజర్వేషన్   ర్యాలీదని ‘The Indian Express’ కథనం ద్వారా తెలుస్తుంది.

ఫోటో-3:
ఈ ఫోటో సెప్టెంబర్ 2016 లో మహారాష్ట్ర లోని జల్నా లో జరిగిన ‘మరాఠా’ రిజర్వేషన్  ర్యాలీదని ‘DNA’ కథనం ద్వారా తెలుస్తుంది.

చివరగా, ఫోటోలు మహరాష్ట్ర లో ‘మరాఠా’ రిజర్వేషన్ కోసం ఆ సామాజిక వర్గీయులు ర్యాలీలు చేపట్టినప్పటివి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

2 Comments

  1. Meda Manohara Reddy on

    Thank you Facebook for your strenuous efforts in search of facts. Now you are a proven Democrat.

scroll