Fake News, Telugu
 

1945 లో సుభాష్ చంద్రబోస్ ని ‘యుద్ధ నేరస్థుడు’ అంటూ క్లిమెంట్ అట్లీకి నెహ్రూ ఉత్తరం రాయలేదు

0

సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్ వారికి చేరవేస్తూ, తగిన చర్య తీసుకోమని 1945 లో అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని క్లిమెంట్ అట్లీ కి జవాహర్ లాల్ నెహ్రూ రాసిన ఉత్తరం ఫోటో అని ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఉత్తరంలో సుభాష్ చంద్రబోస్ ని ‘యుద్ధ నేరస్థుడు’ అని అన్నట్టు చూడవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1945లో సుభాష్ చంద్రబోస్ ని ‘యుద్ధ నేరస్థుడు’ అంటూ అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని క్లిమెంట్ అట్లీ కి జవాహర్ లాల్ నెహ్రూ రాసిన ఉత్తరం ఫోటో.

ఫాక్ట్: 1945లో సుభాష్ చంద్రబోస్ ని ‘యుద్ధ నేరస్థుడు’ అంటూ క్లిమెంట్ అట్లీ కి నెహ్రూ ఉత్తరం రాయలేదు. ఉత్తరంలో చాలా గ్రామర్ మరియు స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి; ఒక దేశ ప్రధాని కి రాసే ఉత్తరంలో అలాంటి తప్పులు సాధారణంగా ఉండవు. అది పబ్లిసిటీ కోసం 1970లో ఖోస్లా కమిషన్ ముందు ఒక వ్యక్తి చేసిన ఫేక్ క్లెయిమ్ అని ‘ఇండియా టుడే’ తో ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ తెలిపాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటోలోని ఉత్తరం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఈ విషయం పై వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. సుభాష్ చంద్రబోస్ గురించి అట్లీ కి నెహ్రూ రాసినట్టు షేర్ అవుతున్నది ఫేక్ ఉత్తరం అని ‘బీబీసీ న్యూస్’ వారు 2016 లో ప్రచురించిన న్యూస్ ఆర్టికల్ లో చదవొచ్చు.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది ఫేక్ ఉత్తరం అని, ఎందుకంటే కేవలం 1970లో ఖోస్లా కమిషన్ ముందు ఒక వ్యక్తి తనుకు నెహ్రు 1945లో రాయమని చెప్పిన ఉత్తరం అని తెలిపినట్టు మాత్రమే ఆధారాలు ఉన్నాయని ‘ఇండియా టుడే’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసిద్ధ చరిత్రకారుడు రామచంద్ర గుహ తెలిపాడు. ఆ ఉత్తరం ఫేక్ అని చెప్పడానికి రామచంద్ర గుహ చెప్పిన కొన్ని కారణాలు:

  • ఆ ఉత్తరంలో చాలా గ్రామర్ మరియు స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి. నెహ్రూ అలాంటి తప్పులు చేసుండడు అని గుహ అన్నాడు.
  • నెహ్రూ చెప్పిన అవే మాటలు అని ఉత్తరం గురించి చెప్పిన వ్యక్తి జ్ఞాపకశక్తిని గుహ ప్రశ్నించాడు.
  • ఒకవేల నిజంగానే అట్లీ కి నెహ్రూ ఉత్తరం రాసి ఉంటే, ఆ ఉత్తరం యొక్క కాపీ అట్లీ పేపర్స్ లో దొరికేది. కానీ, అలాంటి ఉత్తరం ఏమీ లభించలేదు.

అంతేకాదు, ఉత్తరం లోని స్పెల్లింగ్ తప్పుల గురించి చెప్తూ ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

ఈ ఉత్తరం గత కొన్ని ఏళ్ళగా ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. 2019 లోనే FACTLY ఈ ఉత్తరం పై ఇంగ్లీష్ లో రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, 1945 లో సుభాష్ చంద్రబోస్ ని ‘యుద్ధ నేరస్థుడు’ అంటూ క్లిమెంట్ అట్లీ కి నెహ్రూ ఉత్తరం రాయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll