‘NOTA’ (None of the above) కి అందరి కంటే ఎక్కువ ఓట్లు పడితే మళ్ళీ ఎన్నికలు వస్తాయంటూ ఒక పోస్ట్ ని కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా):అభ్యర్థుల కంటే NOTA కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నిక రద్దు అవ్వుతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వెయ్యండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
ఫాక్ట్ (నిజం): ఒకవేళ NOTA కి మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికీ వచ్చాయో వారిని గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు. అందుకే పోస్ట్ లో చెప్పింది FALSE
ఈ విషయం మీద గూగుల్ లో వెతకగా ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా 2013 లో ‘NOTA’ మీద వివరణ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఒకటి వారి వెబ్ సైట్ లో లభిస్తుంది. దాంట్లో ‘Clause (a) of Rule 64 of Conduct of Election Rules, 1961, read with Section 65 of the Representation of the People Act, 1951’ ప్రకారం ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడతాయో తనను గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారని పేర్కొనింది. అలానే ఒక వేల ‘NOTA’ కి మిగిలిన వల్ల కంటే ఎక్కువ ఓట్లు పడినా కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ ఓట్లు ఎక్కువ వస్తాయో తనని గెలిచినా అభ్యర్థిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు. కావున, పోస్ట్ లో చెప్పినట్టుగా ‘NOTA’ కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయరు.
చివరగా, ‘NOTA’ కి ఎక్కువ ఓట్లు పడినా కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే గెలిచినట్లు.