Fake News, Telugu
 

నైజీరియా పేదరికంలో భారతదేశం కంటే వెనకబడి ఉంది

0

పేదరికంలో భారత్ నైజీరియా దేశాన్ని అధిగమించింది అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో ఈ కధనం ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పేదరికంలో భారత్ నైజీరియా దేశాన్ని అధిగమించింది

ఫాక్ట్(నిజం): జనాభా పరంగా నైజీరియాలో భారతదేశంకన్నా తక్కువ మంది పేదరికంలో ఉన్నప్పటికీ,  శాతాల పరంగా నైజీరియా అధిక పేదరికం నిష్పత్తిని కలిగి ఉంది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విదంగా ఉంది. 

ఈ క్లెయిమ్ గురించి తెలుసుకోవటానికి తగిన కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, వరల్డ్ పావర్టీ క్లాక్ మరియు వరల్డ్ బ్యాంకు రిపోర్ట్స్ ద్వారా భారతదేశం మరియు నైజీరియాలో ఉన్న పేద ప్రజల యొక్క డేటా సేకరించాం.

వరల్డ్ పావర్టీ క్లాక్’అనేది ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగా పేదరికాన్ని పర్యవేక్షించే ఆన్‌లైన్ సాధనం. వివిధ దేశాలలో నిజ-సమయ పేదరిక డేటాను అందిస్తుంది. జనాభా పరంగా నైజీరియాలో భారతదేశంకన్నా తక్కువ మంది పేదరికంలో ఉన్నప్పటికీ,  నైజీరియా పేదరికంలో భారతదేశం కంటే శాతాల పరంగా అధిక నిష్పత్తిని కలిగి ఉంది.

2011 మరియు 2019 మధ్య, భారతదేశంలో అత్యంత పేదరికంలో నివసిస్తున్న జనాభాలో సగానికి సగం తగ్గిపోయిందని అంచనా వేయబడింది.అయితే, ఇటీవలి సంవత్సరాలలో, ముఖ్యంగా COVID-19 సమయంలో పేదరికం తగ్గింపు వేగం మందగించింది అని, అయితే 2021-22లో అది నియంత్రించబడింది అని వరల్డ్ బ్యాంకు రిపోర్ట్ ఇటీవల తెలిపింది. 

వరల్డ్ బ్యాంకు ప్రతీ ఏడాది రిలీజ్ చేసే ‘ముల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’ రిపోర్ట్, 2017–2022 సర్వేల ఆధారంగా అంచనాలు చూడగా, భారతదేశంలో బహుమితీయ పేదరికంలో 16.4% జనాభా ఉండగా, నైజీరియాలో 33% ఉన్నట్టు తెలిసింది.

 చివరిగా, నైజీరియా పేదరికంలో భారతదేశం కంటే అధిక నిష్పత్తిని కలిగి ఉంది. 

Share.

About Author

Comments are closed.

scroll