ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఆయన నమస్కరిస్తున్నప్పటికి కూడా ఆమె ప్రతి నమస్కారం చేయకుండా పొగరుగా చూస్తున్నారని చెప్తూ చాలా మంది పోస్టు చేస్తున్నారు. ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ లో ‘అంపన్’ తుపాను వల్ల జరిగిన విధ్వంసాన్ని సమీక్ష చేయడానికి ఇటీవల ఆ రాష్ట్రానికి వెళ్ళారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోల్‌కతా విమానాశ్రయంలో మోదీ దిగిన తర్వాత మమతా బెనర్జీ ఆయనకి నమస్కరించలేదు.
ఫాక్ట్ (నిజం): ఫోటో ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు నమస్కారం చేసుకోవడం కంటే ముందు తీసినది. మోదీ కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన సందర్భం లో తీసిన వీడియో లో మమతా బెనర్జీ ఆయనకీ నమస్కరించిన్నట్లుగా చూడవచ్చు. కావున పోస్టు లో చెప్పింది తప్పు.
యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ లో ‘అంపన్’ తుపాను వల్ల జరిగిన విధ్వంసాన్ని సమీక్ష చేయడానికి కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన వీడియో లభించింది. ‘ANI News Official’ వారు తమ యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసిన ఆ వీడియో లో మోదీ మరియు మమత బెనర్జీ ఒకరికి ఒకరు నమస్కారం చేసుకున్నట్లుగా చూడవచ్చు. కావున ఫోటో ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు నమస్కారం చేసుకోవడం కంటే ముందు తీసినది.
చివరగా, మోదీ కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన తర్వాత మమతా బెనర్జీ కూడా ఆయన్ని నమస్కారంతో స్వాగతించారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?