Fake News, Telugu
 

ATM లో CANCEL బటన్ రెండు సార్లు నొక్కడం గురించి RBI ఎటువంటి సమాచారం ప్రకంటించలేదు.

0

ATM నుండి డబ్బు డ్రా చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన చిట్కాను ఇటీవల RBI ప్రకటించించింది అంటూ ఈ మధ్య ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా షేర్ అవుతుంది. ఆ పోస్ట్ ప్రకారం మనం డబ్బు డ్రా చేసయడానికి ATMలో card insert చేసేకంటే ముందు CANCEL button ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మనయొక్క PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది మరియు మన PIN number భద్రంగా వుంటుంది అని ప్రచారం అవుతుంది. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ATMలో card insert చేసేకంటే ముందు CANCEL button ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మనయొక్క PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది

ఫాక్ట్ (నిజం): RBI అటువంటి చిట్కాను ఎక్కడా ప్రకటించలేదు. కావున పోస్ట్ లో చెప్పిన సమాచారం లో ఎలాంటి నిజం లేదు

RBI వెబ్సైటు లో ATM వాడుకకి సంబంధించి చాలా సమాచారాన్ని ఇచ్చారు. కానీ అందులో ఎక్కడ కూడా పోస్ట్ లో చెప్పినట్టు CANCEL బటన్ ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మనయొక్క PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది మరియు మన PIN number భద్రంగా వుంటుంది అని చెప్పలేదు. అలానే పోస్ట్ లో చెప్పిన సమాచారం, ఇమేజ్ వాళ్ళ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ఖాతాలలో కూడ ఎక్కడా పెట్టలేదు.

ఇలాంటి తప్పుడు సమాచారమే భారత్ మరియు ఇతర దేశాలలో ఇంతకు ముందు చాలా సార్లు ప్రచారం జరిగింది అని Snopes మరియు Africa Check  ప్రచురించాయి.

చివరగా, ఇలాంటి చిట్కా RBI చెప్పలేదు మరియు పోస్ట్ లో చెప్పిన సమాచారం లో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll