Fake News, Telugu
 

వియత్నాం దేశానికి చెందిన ఒక హోటల్ ప్రచార ప్రకటన వీడియోను కస్టమర్‌కు హోటల్‌లోని ఉద్యోగులు అరుదైన ఆతిథ్యం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఒక హోటల్‌లో కస్టమర్‌కు పది మందికిపైగా ఉద్యోగులు ఆతిథ్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఒక ఉద్యోగి కస్టమర్‌ ముందు ఆహారాన్ని సర్వ్ చేస్తే, మరొకరు అందులో ఉప్పు వేస్తు, ఇంకొకరు సాస్ వేస్తూ, అలాగ, చివరిగా ఒక ఉద్యోగిని  కస్టమర్‌కు నోట్లో ఆహారాన్ని పెడుతున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హోటల్‌లో కస్టమర్‌కు పది మందికిపైగా ఉద్యోగులు ఆతిథ్యం చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరంలోని గార్డన్ రెస్టారెంట్ తమ హోటల్ ప్రచారం  కోసం రూపొంధించిన ఒక ప్రకటన వీడియో ఇది. కస్టమర్లపై తమ సంస్థ చూపించే శ్రద్ధను చూపించడానికి ఈ ప్రకటన వీడియోని రూపొందించామని గార్డన్ రెస్టారెంట్ మీడియాకు స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలను షేర్ చేస్తూ వియత్నాం వార్తా సంస్థ ‘Dantri’ 25 జులై 2023 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరంలోని గార్డన్ రెస్టారెంట్ పబ్లిష్ చేసిందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

సోషల్ మీడియాలో తమ వీడియోకి వస్తున్న మిశ్రమ స్పందన గురించి గార్డన్ రెస్టారెంట్ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ, ఇది తమ హోటల్ ప్రచారం కోసం రూపొంధించిన ఒక ప్రకటన వీడియో అని, కస్టమర్లపై తమ సంస్థ చూపించే శ్రద్ధను చూపించడానికి ఈ ప్రకటన వీడియోని రూపొందించామని తెలిపారు. ఈ విషయాలను తెలుపుతూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఇటీవల ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని గార్డన్ రెస్టారెంట్ సంస్థ 12 జులై 2023 నాడు పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో కస్టమర్‌గా కనిపిస్తున్న అదే వ్యక్తి, గార్డన్ రెస్టారెంట్‌కు సంబంధించిన మరికొన్ని ప్రకటన వీడియోలలో కూడా నటించారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఒక ప్రకటన వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, వియత్నాం దేశానికి చెందిన ఒక హోటల్ ప్రచార ప్రకటన వీడియోని కస్టమర్‌కు హోటల్‌లోని ఉద్యోగులు అరుధైన ఆతిథ్యం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll