Fake News, Telugu
 

2017 లో ABVP ఆవిర్భావ దినోత్సవాన తీసిన ఫోటోని అవాస్తవమైన కథనంతో పోస్ట్ చేశారు

0

దేవాలయంలో బాంబ్ పెట్టడానికి ప్రయత్నించిన బీ.జే.పీ కార్యకర్తలని పోలీసువారు పట్టుకున్నారంటూ ఒక ఫొటోతో కూడిన పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఆరోపించిన విషయాలు ఎంతవరకు వాస్తవమో ఓసారి విశ్లేషిద్దాం .

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): సూర్య దేవాలయంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రణాళిక వేసిన నలుగురు BJP కార్యకర్తలు మరియు ఒక BJP నాయకుడు; పోలిసుల అప్రమత్తత తో దొరికిపోయారు.

ఫాక్ట్ (నిజం): ఈ మధ్య కాలంలో దేశంలోని ఏ ప్రఖ్యాత సూర్య దేవాలయంలో కూడా బాంబ్ బ్లాస్ట్ ప్రయత్నం జరిగినట్టుగా మీడియా లో ఎక్కడా కథనాలు రాలేదు మరియు పోస్ట్ లో పెట్టిన ఫోటో 2017 ABVP ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫేస్బుక్ పోస్ట్ లో ఏ ప్రాంతం లోని సూర్య దేవాలయం కి సంబంధించి పెట్టారో స్పష్టంగా లేదు. పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఫోటోని గత కొంత కాలంగా వివిధ సందర్భాలలో ఉపయోగించినట్టుగా అర్థం అవుతోంది. ఒక సందర్భం లో క్రయిస్తవ మత మార్పిడికి సంబంధించిన కథనంలో ఉపయోగించారు. మరోసారి హిందూ మాతమార్పిడికి  సంబంధించిన కథనంలో ఉపయోగించారు. ఈ ఫోటోని మొట్ట మొదటిసారి అక్టోబర్ 1, 2017న ‘The Caravan’ అనే వార్తా సంస్థ ABVP ఆవిర్భావ దినోత్సవం -2017 గురించి తాము రాసిన ‘Student Days’ కథనంలో ఉపయోగించింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని CETRI అనే NGO అక్టోబర్ 24, 2017న  ప్రచురించిన ‘INDIA : STUDENT DAY. THE AGE OF ABVP’ అనే కథనంలో కూడా ఉపయోగించారు.

చివరగా, ABVP ఆవిర్భావ దినోత్సవం-2017 కి సంబంధించిన ఫోటోని అవాస్తవమైన కథనంతో ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll