Fake News, Telugu
 

మోడీ మరియు సచిన్ యొక్క పాత చిత్రాన్ని అసంబద్ధమైన వాదనలతో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు

0

నరేంద్ర మోడీ తో సచిన్ టెండూల్కర్ మరియు అతని భార్య ఉన్న ఫోటోతో కూడిన పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో సచిన్ టెండూల్కర్ మోడీని కలుసుకుని సార్వత్రిక ఎన్నికలు-2019 లో బీజేపీకి తన మద్దతును ప్రకటించారని పేర్కొన్నారు. పోస్ట్ లో చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మోడీని కలుసుకుని సార్వత్రిక ఎన్నికలు-2019లో బీజేపీకి తన మద్దతును ప్రకటించారు

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటోని ‘AajTak’ వార్తా సంస్థ వారు 2017 లో ప్రచురించిన ఒక కథనంలో చూడవచ్చు. ఆ కథనం ప్రకారం సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర పై తెరకెక్కిన చిత్రం “సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్” విడుదల గురించి నరేంద్ర మోడిని కలిసి చెప్పారు. కావున, పోస్ట్ లో చెప్పిన విషయాలు ప్రక్కద్రోవ పట్టించేలా ఉన్నాయి.

పోస్ట్ లో ఉన్న ఫోటో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర పై తెరకెక్కిన చిత్రం “సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్” విడుదల గురించి నరేంద్ర మోడికి  చెప్పిన సందర్భంలో తీసినదిగా తెలిసింది. ‘AajTak’ వార్తా సంస్థ మే 19, 2017 లో దీని పైన ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. అందులో, సచిన్ టెండూల్కర్ బీజేపీకి మద్దతు ఇచ్చినట్లుగా ఎటువంటి ప్రస్తావన లేదు. దీని గురుంచి నరేంద్ర మోడీ కూడా తన ట్విట్టర్ పై 2017 లో ట్వీట్ చేసాడు

చివరగా, మోడీ మరియు సచిన్ యొక్క పాత చిత్రాన్ని అసంబద్ధమైన వాదనలతో ఇప్పుడు పోస్ట్ చేసి ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll